PALLAVOTSAVAM OBSERVED_ తిరుమలలో ఘనంగా పల్లవోత్సవం

Tirumala, 23 July 2018: In view of the birth anniversary of the Mysore Maharaja I, Pallavotsavam was observed in Tirumala on July 23.

Tirumala JEO Sri KS Sreenivasa Raju who took part in this fete, speaking to media persosn said, that TTD has been observing Pallavotsavam since several decades in connection with the birth anniversary of the Maharaja I of Mysore Sansthan, who made huge contributions to the Hill Shrine of Lord Venkateswara.
“After Sahasra Deepalankara Seva, the processional deities reached the gardens in Karnataka Chowltries where the Lord was accorded religious reception by the representatives of the Karnataka government”, he added.

Temple peishkar Sri Ramesh was also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తిరుమలలో ఘనంగా పల్లవోత్సవం

తిరుమల, 2018 జూలై 23: తిరుమలలో సోమవారంనాడు పల్లవోత్సవం ఘనంగా జరిగింది. టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ మైసూరు మహారాజు జయంతిని పురస్కరించుకుని టిటిడి పల్లవోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. సహస్రదీపాలంకారసేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేసి మైసూర్‌ సంస్థానం వారి ఆతిథ్యాన్ని స్వీకరించారని తెలిపారు.

అనంతరం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్థానం ప్రతినిధులు స్వామి, అమ్మవార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పేష్కార్‌ శ్రీ రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.