PANCHAGAVYA PRODUCTS TO COME OUT WITH BRAND “NAMAMI GOVINDA” IN TEN DAYS-EO _ న‌మామి గోవింద బ్రాండ్‌తో ప‌ది రోజుల్లో పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తులు : టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

న‌మామి గోవింద బ్రాండ్‌తో ప‌ది రోజుల్లో పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తులు : టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

తిరుపతి, 2022, జనవరి 12: న‌మామి గోవింద బ్రాండ్ పేరుతో ప‌ది రోజుల్లో పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తులను ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకొస్తామ‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. తిరుప‌తిలోని డిపిడ‌బ్ల్యు స్టోర్‌లో పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తుల త‌యారీ కేంద్రాన్ని బుధ‌వారం ఈవో ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ స‌నాత‌న హిందూ ధ‌ర్మ ప్ర‌చారంలో భాగంగా గోమాత ప్రాశ‌స్త్యాన్ని భ‌క్తుల‌కు తెలియ‌జేసేందుకు పంచ‌గ‌వ్యాల‌తో ప‌లుర‌కాల గృహావ‌స‌ర ఉత్ప‌త్తులు త‌యారు చేస్తున్న‌ట్టు తెలిపారు. కోయంబ‌త్తూరుకు చెందిన ఆశీర్వాద్ ఆయుర్వేద ఫార్మ‌సీ సాంకేతిక స‌హ‌కారంతో 15 ర‌కాల ఉత్ప‌త్తులు త‌యారు చేస్తున్నామ‌ని, ప‌నులు తుదిద‌శ‌కు చేరుకున్నాయ‌ని చెప్పారు. ఈ ఉత్ప‌త్తుల్లో హెర్బ‌ల్ సోప్‌, ధూప్ చూర్ణం, అగ‌ర‌బ‌త్తీ, హెర్బ‌ల్ షాంపు, హెర్బ‌ల్ టూత్ పౌడ‌ర్‌, విభూది, నాజిల్ డ్రాప్స్‌, హెర్బ‌ల్ పేస్ ప్యాక్‌, ధూప్ చూర్ణం, హెర్బ‌ల్ ఫ్లోర్ క్లీన‌ర్‌, ధూప్‌చూర్ణం సాంబ్రాణి క‌ప్‌, ధూప్ కోన్‌, ధూప్ స్టిక్స్‌, గో అర్కం, పిడ‌క‌లు, కౌడంగ్ లాగ్ ఉన్నాయ‌న్నారు. పంచ‌భూతాల సాక్షిగా ఐదు హోమ‌గుండాల్లో ఎంతో ప‌విత్రంగా విభూది త‌యారు చేస్తున్నామ‌ని చెప్పారు. అగ‌ర‌బ‌త్తీల త‌ర‌హాలోనే ఈ ఉత్ప‌త్తుల‌ను కూడా భ‌క్తులు ఆద‌రించాల‌ని కోరారు.

ఈవో వెంట జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, గోశాల సంచాల‌కులు డాక్ట‌ర్ హ‌ర‌నాథ‌రెడ్డి, ఎస్వీ ఆయుర్వేద క‌ళాశాల ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ ముర‌ళీకృష్ణ త‌దిత‌రులు ఉన్నారు.

అంతకుముందు తిరుపతి లోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో టీటీడీ గోవింద యాప్ లో కంటెంట్ కు సంబంధించి ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఫీచర్స్ పై ఈవో అధికారులతో సమీక్షించారు. ఎఫ్ఏసిఏవో శ్రీ బాలాజి, ఐటి సలహాదారు శ్రీ అమర్, ఐటి విభాగాధిప‌తి శ్రీ శేషారెడ్డి పాల్గొన్నారు.

అంతకుముందు టీటీడీ ఇంజినీర్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ ముద్రించిన నూత‌న సంవ‌త్స‌ర డైరీని ఈవో ఆవిష్క‌రించారు. చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావుతోపాటు ఇంజినీరింగ్ అధికారులు, ప‌లువురు అసోసియేష‌న్ నాయ‌కులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

TIRUPATI, 12 JANUARY 2022:  The prestigious Panchagavya products mulled by TTD will come to the public fore in the next ten days with a brand named “Namami Govinda” said TTD EO Dr KS Jawahar Reddy.

 

The EO inspected the Panchagavya manufacturing unit in Marketing Office in Tirupati on Wednesday along with JEO Sri Veerabrahmam. 

 

Speaking on the occasion, EO said, with an aim to enlighten the denizens on the importance and significance of Gomata in Hindu Sanatana Dharma, TTD is coming out with Panchagavya products that are used in the households in their daily routine with the technical support offered by Coimbatore based Asirwad Ayurveda Pharmacy. 

 

He said about 15 products are getting ready for launch in the next ten days which included Dhoop, Herbal Soaps, floor cleaner, shampoo, tooth powder, nostril drops, face packs etc. Akin to Agarbattis, these products also will be made available for the pilgrim public”, he maintained.

 

CE Sri Nageswara Rao, Gosala Director Dr Harinath Reddy, SV Ayurvedic College Principal Dr Muralikrishna and others were also present.

 

Earlier, the EO also reviewed the new accommodation app with the IT officials in SPRH at Tirupati. FACAO Sri Balaji, IT Advisor Sri Amar, IT Chief Sri Sesha Reddy were also present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI