PANCHAMI THEERTHAM WITNESSES SEA OF HUMANITY_ ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు

Tiruchanoor, 12 Dec. 18: The big day witnessed thousands of pilgrims taking holy bath in Padmasarovaram on the last day of Ammavari Karthika Brahmotsavams at Tiruchanoor on Wednesday.

PROCESSION OF PADI SARE

The Padi Sare from Tirumala reached the Tiruchanoor temple at around 10am. TTD EO Sri Anil Kumar Singhal along with Tirupati JEO Sri P Bhaskar walked along the procession from Pasupu Mandapam to Panchami Theertha Mandapam.

JEWELS PRESENTED

As a Birth Day gift to His beloved better half, Lord has presented two precious gifts including Rs.22lakhs worth 1.74kilos weighing Golden Lakshmi Kasula Haram and Rs.9lakhs worth Golden Kumbha Harati weighing around 776grams.

SNAPANAM

Snapana Tirumanjanam commenced at 10.45am. The utsava murthy of Goddess Sri Padmavathi Devi along with Sri Sudardarshana Chakrattalwar was rendered the special tirumanjanam. First with milk, followed by curd, honey, turmeric and finally applied chandan before rendering Chakra Snanam to the holy disc.

MESMERIZING DECORATION

Each time abhishekam renders to goddess, she was decked with an interesting ornament and garland made of dry fruits, flowers and pearls. The garlands made of almonds, cherries caught the attention of devotees to a great extent.

THEERTHA SNANAM

At the decided muhurtam at 11.42am in Makara Lagnam, Chakra Snanam to Sri Sudarshana Chakrattalwar was performed. The devotees took a holy dip along with the holy disc in the holy waters of Padma Sarovaram chanting Govinda Namas.

THANKS GIVING

TTD Trust Board Chairman Sri P Sudhakar Yadav, EO Sri Anil Kumar Singhal and Tirupati JEO Sri P Bhaskar thanked all the devotees for their discipline and patience and making the brahmotsavams a huge success especially Panchami Theertam event.

OTHER HIGHLIGHTS

The Padma Pushkarini was completely filled with scores of pilgrims by 9.30am itself. The devotees were thrilled to witness the live telecast of snapanam by SVBC was witnessed in elation by thousands of devotees on the giant LED screens arranged in pushkarini.

Tirumala JEO Sri KS Sreenivasa Raju also took part in the fete while CVSO Sri Gopinath Jetti, Tirupati Urban SP Sri Anburajan constantly monitored the situation and ensured incident free event.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు

పంచమితీర్థంనాడు విశేష సంఖ్యలో భక్తుల పవిత్రస్నానం

భక్తులకు టిటిడి విస్తృత ఏర్పాట్లు

లక్ష మందికి అన్నప్రసాదాలు, 50 వేల మందికి అల్పాహారం

పోలీసులు, టిటిడి విజిలెన్స్‌, శ్రీవారి సేవకులు, స్కౌట్స్‌ విశేష సేవలు

తిరుపతి, 2018 డిసెంబరు 12: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన కార్తీక బ్ర‌హ్మోత్సవాలు బుధ‌వారం పంచమితీర్థ మహోత్సవంతో ఘనంగా ముగిశాయి. చివరిరోజు ఆలయం వద్ద గల పద్మ పుష్కరిణిలో జరిగిన చక్రస్నానం కార్యక్రమానికి విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి పవిత్రస్నానాలు ఆచరించారు. ఈ ఉత్సవానికి విచ్చేసిన అశేష భక్తజనవాహినికి ఎలాంటి రాజీకి తావులేకుండా టిటిడి విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది. టిటిడి ఈవో శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, సివిఎస్‌వో శ్రీ గోపినాథ్‌జెట్టి ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.

లక్ష మందికి అన్నప్రసాదాలు, 50 వేల మందికి అల్పాహారం

టిటిడి అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో సుమారు లక్ష మంది భక్తులకు అన్నప్రసాదాలు, ఉద‌యం 50 వేల మందికి అల్పాహారం అందించారు. భ‌క్తుల సౌక‌ర్యార్థం అద‌నంగా 60 అన్న‌ప్ర‌సాదం కౌంట‌ర్లు ఏర్పాటు చేశారు. తోళ్ళ‌ప్ప గార్డ‌న్స్‌లో 26, ఎస్వీ హైస్కూల్ వ‌ద్ద 18, శ్రీ అయ్య‌ప్ప‌స్వామివారి ఆల‌యం వ‌ద్ద 16 అన్న‌ప్ర‌సాదం కౌంట‌ర్ల‌లో భక్తులకు కదంబం, చక్కెర పొంగళి, దధ్యోధనం అందజేశారు. అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ‌కు 120 మంది సిబ్బంది, 150 మంది శ్రీ‌వారి సేవ‌కులు సేవ‌లందించారు. అన్నప్రసాద విభాగం ప్ర‌త్యేకాధికారి శ్రీ వేణుగోపాల్, క్యాట‌రింగ్ అధికారి శ్రీ టి.దేశ‌య్య అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించారు.

పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు

పంచమితీర్థానికి విచ్చేసిన భక్తులకు టిటిడి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. పుష్కరిణిలోకి ప్రవేశించేందుకు 11 గేట్లు, తిరిగి వెళ్లేందుకు 17 గేట్లను ఏర్పాటుచేశారు. పుష్కరిణి వద్ద భద్రతా ఏర్పాట్లను తిరుపతి అర్బన్‌ ఎస్పీ శ్రీ అన్బురాజ‌న్‌, టిటిడి సివిఎస్‌వో శ్రీ గోపినాథ్‌జెట్టి, అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, డిఎస్పీ శ్రీ మునిరామయ్య, విఎస్‌వోలు శ్రీ అశోక్‌కుమార్ గౌడ్‌, శ్రీ‌మ‌తి స‌దాల‌క్ష్మి, శ్రీ మ‌నోహ‌ర్‌ ఆధ్వర్యంలో విజిలెన్స్‌ అధికారులు, పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పార్కింగ్‌ ఏర్పాట్లు, ట్రాఫిక్‌ మళ్లింపు చర్యలు చేపట్టారు. కాలినడకన వచ్చిన భక్తులకు ఇబ్బందులు లేకుండా తిరుచానూరు బయటి నుంచే వాహనాలను దారి మళ్లించారు. తిరుపతి నుంచి వచ్చే వాహనాలకు, పాడిపేట వైపు నుంచి వచ్చే వాహనాలకు ఆయా ప్రాంతాల్లో పార్కింగ్‌ ఏర్పాట్లు చేపట్టారు. టిటిడి భ‌ద్ర‌తా సిబ్బంది 300 మంది, స్కౌట్స్ అండ్ గైడ్స్ 200, ఎన్‌.సి.సి.విద్యార్థులు 200, శ్రీ‌వారి సేవ‌కులు 200, పోలీస్ సిబ్బంది 1500 మందితో భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేప‌ట్టారు.

దాదాపు 2 లక్షల తాగునీటి ప్యాకెట్ల పంపిణీ :

పంచమితీర్థం సందర్భంగా విచ్చేసిన లక్షలాది మంది భక్తులకు టిటిడి ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో దాదాపు 2 లక్షల తాగునీటి ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఆలయం, పుష్కరిణి పరిసరాల్లో ఎప్పటికప్పుడు చెత్తను తొలగించి పరిశుభ్రంగా ఉంచారు. భక్తుల సౌకర్యార్థం 314 శాశ్వ‌త, తాత్కాలిక, మొబైల్‌ మ‌రుగుదొడ్లు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల్లో రోజుకు 300 మంది, పంచమితీర్థం రోజున 600 మంది పారిశుద్ధ్య సిబ్బంది సేవలందించారు.

శ్రీవారి సేవకులు, స్కౌట్స్‌ విశేషసేవలు :

బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తులకు శ్రీవారి సేవకులు, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విశేష సేవలు అందించారు. ఆలయంలోని క్యూలైన్లు, వాహనసేవల్లో, అన్నప్రసాద భవనంలో భక్తులకు సేవలందించారు. మొత్తం 450 మంది శ్రీవారిసేవకులు, 200 మంది స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ భక్తులకు సేవలు అందించారు.

భక్తులకు విశేషంగా వైద్యసేవలు :

బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తులకు విశేషంగా వైద్యసేవలు అందించారు. అమ్మవారి వాహనం మోసే వాహనబేరర్లకు వైద్యపరంగా తగిన చర్యలు చేపట్టి ఉపశమనం కల్పించారు. టిటిడి వైద్యులతోపాటు స్విమ్స్‌, రుయా ఆస్పత్రుల నుంచి వైద్యసిబ్బంది, ఆయుర్వేద వైద్యులు సేవలందించారు. 3 ప్రాంతాల‌లో ప్ర‌థ‌మ‌చికిత్స కేంద్రాలు ఏర్పాటుచేశారు.

సాంస్కృతిక కార్యక్రమాలకు విశేష స్పందన :

హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహనసేవల్లో కోలాటాలు, భజనలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన జానపద కళాబృందాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తిరుచానూరులోని ఆస్థానమండపం, తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం, మహతి కళాక్షేత్రం, శిల్పారామం వేదికలపై ప్రతిరోజూ ఆధ్యాత్మిక, ధార్మిక, సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్వీ గోశాల ఆధ్వర్యంలో వాహనసేవల ఎదుట గజాలు, అశ్వాలు, వృషభాల ఊరేగింపు వేడుకగా సాగింది.

పార్కింగ్

పంచ‌మి తీర్థానికి విచ్చేసే భ‌క్తులకు శిల్పారామం, త‌న‌ప‌ల్లి క్రాస్‌, మార్కెట్‌యార్డు, రామానాయుడు క‌ల్యాణ మండ‌పం, పూడి జంక్ష‌న్‌, తిరుచానూరు హ‌రిజ‌న‌వాడ వ‌ద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు. ప్ర‌ముఖుల‌కు తిరుచానూరు పంచాయ‌తీ కార్యాల‌యం ఎదురుగా పార్కింగ్ ఏర్పాటు చేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.