PANCHARATHRA AGAMA VIDHI IN TIRUCHANOOR TEMPLE _ శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల ప్రత్యేకవ్యాసం పాంచరాత్ర ఆగమ వైశిష్ట్యం

శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల ప్రత్యేకవ్యాసం పాంచరాత్ర ఆగమ వైశిష్ట్యం
 
తిరుపతి, 2022 నవంబరు 22: నవంబరు 19వ తేదీ ప్రారంభమైన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు 28వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి.
 
అమ్మవారి ఆలయంలో పాంచరాత్ర ఆగమం ప్రకారం కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పాంచరాత్ర ఆగమ విశిష్టతను తెలుసుకుందాం.
 
పాంచరాత్ర ఆగమం సాక్షాత్తు భగవంతుడే ఉపదేశించినది.  భగవంతుని చేరుకునేందుకు గల మార్గాలను నిర్దేశించినవి ఆగమాలు. భగవంతుడిని ఎలా అర్చించాలి, ఎలా ప్రతిష్ఠించాలి, ఏడాదిలో జరిగే నిత్య, నైమిత్తిక, కామ్యము అనే ఉత్సవాలను ఎలా నిర్వహించాలి, కంకణబట్టర్‌ ఎలాంటి అధ్యయనం చేయాలి, ఉత్సవాలు నిర్వహించే యజమానికి ఎలాంటి లక్షణాలు ఉండాలి అనే విషయాలను ఆగమాలు తెలియజేస్తున్నాయి. పాంచ అంటే ఐదు, రాత్ర అంటే రోజులు అని అర్థం. భగవంతుడు ఐదు రోజుల పాటు అనంతుడు, గరుత్మంతుడు, విష్వక్సేనమూర్తి, చతుర్ముఖ బ్రహ్మ, పరమేశ్వరుడు అనే ఐదుగురికి ఉపదేశించినది కావున దీనికి పాంచరాత్రం అనే పేరు వచ్చింది. ఇది మనుషుల అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది.
 
లోకంలో ప్రతి జీవి  శ్రీవైకుంఠానికి చేరి శాశ్వతమైన ఆనందం పొందేందుకు పాంచరాత్ర ఆగమం దోహదపడుతుంది. ఈ ఆగమంలో భగవంతుని సేవించేందుకు దివ్యము, ఆర్ఘ్యము, దైవము వంటి దాదాపు 200 పూజా విధానాలున్నాయి. శ్రీ పద్మ సంహిత, శ్రీ ప్రశ్న సంహిత మొదలైన శాస్త్రాల్లో సూచించిన ప్రకారం శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నిత్య, నైమిత్తిక, కామ్యోత్సవాలను జరుపుతున్నారు.  బ్రహ్మోత్సవాలు, వసంతోత్సవాలు, పవిత్రోత్సవాలు, తెప్పోత్సవాలు, సుందరరాజస్వామివారి అవతారోత్సవాలు, నవరాత్రి ఉత్సవాలను నిత్యోత్సవాలుగా, సంక్రాంతి, గ్రహణం సందర్భంగా చేపట్టే క్రతువులను నైమిత్తిక ఉత్సవాలుగా, భక్తుల కోరిక మేరకు నిర్వహించే ఆర్జితసేవలను కామ్యోత్సవాలుగా పిలుస్తారు.
 
చతుష్టానార్చన విశేషం : 
 
శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చతుష్టానార్చనకు విశేష ప్రాముఖ్యత ఉంది. ప్రతిరోజూ ఉదయం 5 నుంచి 6 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు యాగశాలలో అర్చకులు శాస్త్రోక్తంగా చతుష్టానార్చన నిర్వహిస్తారు. శ్రీవైకుంఠం నుంచి పరవాసుదేవుడిని జలం, మహాలక్ష్మిని కుంభం, అగ్నిదేవుడిని హోమం, చక్రాబ్జమండలాన్ని అక్షింతలు, యాగబేరాన్ని బింబం ద్వారా ఆవాహన చేస్తారు. దీనివల్ల  ఇష్ట ప్రాప్తి చేకూరుతుందని ఐతిహ్యం .
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Tirupati, 22 November 2022: The annual Navahnika Karthika Brahmotsavams of Sri Padmavati Ammavaru Temple at Tiruchanoor is being observed as a mega religious fete akin to Tirumala Srivari Brahmotsavmas with utmost spiritual fervour.

As the annual brahmotsavams in Tirumala are being performed as per the traditions of the Vaikhanasa Agama, the nine-day festival of Sri Padmavathi Ammavaru are being observed as per the tenets of Pancharathra Agama, which has its own unique norms and practices.

SIGNIFICANCE OF PANCHARATRA AGAMA:

It is said that the Pancharatha Agama is framed on the direct dictation of the presiding deity of Sri Padmavathi Devi on how to perform Archanas, daily rituals, special rituals, annual festivals etc. It also laid down norms to be followed by Kankana Bhattar, the religious person, who supervises all the rituals and also the duties and functions of the Yajamani (temple chief).

MEANING OF PANCHARATHRA

“Pancha” means five and “Rathra” means Nights. Each day is dedicated to a specific deity and during these five nights the Serpent King Ananta, the king of aves-Garukmanta, the commander in chief of Sri Venkateswara-Viswakshenai, the creator- Chaturmukha Brahma, and the supreme lord-Parameswara are invoked. The Naradiya Samhita describes “Pancharatra” as five types of knowledge.

200 PUJA VIDHIS IN PANCHARATRA

It is a divine science to ward off the ignorance of the human beings in service of Lord. The Pancharatha Agamas also explains nearly 200 puja methods as engraved in the Sri Padma Samhita, Naradiya Samhita and many other epics. It is the compendium of traditions and practices now being followed in daily rituals at Sri Padmavati Ammavari Temple.

All the Utsavavams, Brahmotsvams, Teppotsavams, Vasantotsavams, Navaratri Utsavams, Sundararaja Swamivari Avatarotsavams, Nitya utsavavams, Granahanams, all Arjita sevas etc. in the temple are performed adhering to the norms of the Pancharathra Agama in Tiruchanoor temple.

IMPORTANCE OF CHATUSTARCHANA

The Chatustarchana ritual has a great significance in the Sri Padmavati Ammavari Temple during annual Brahmotsavams. This event is performed every day at the Yagashala between 5am and 6 AM and again between 4pm and 5.30pm by the temple archakas. The objective of the ritual is to ward off the evil forces in the society and ensure the conduct of Navahnika Karthika Brahmotsavams in a hassle-free manner.

Among the various festivals and religious events which are being observed all through the year in Tiruchanoor, the annual Brahmotavams of Goddess Padmavathi who is credited and revered as “Sarva Swatantra Veera Lakshmi” are considered the most important as the Goddess of Riches in all Her religious splendour takes out majestic ride on various carriers during these nine days to bless Her devotees with good fortunes.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI