PANCHARATRA AGAMA PREACHES MOKSHA DHARMA- TTD AGAMA ADVISORపాంచరాత్ర ఆగమంలో మోక్షధర్మం – టీటీడీ పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీ కాండూరు శ్రీనివాసాచార్యులు
పాంచరాత్ర ఆగమంలో మోక్షధర్మం – టీటీడీ పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీ కాండూరు శ్రీనివాసాచార్యులు
తిరుపతి, 2023 డిసెంబరు 02: పాంచరాత్ర ఆగమంలో సూచించిన ధర్మమార్గం మోక్షాన్ని ప్రసాదిస్తుందని టీటీడీ పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీ కాండూరు శ్రీనివాసాచార్యులు తెలియజేశారు. టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు, భగవత్‌శాస్త్ర పాంచరాత్ర ఆగమ సంరక్షణ సభ సంయుక్త ఆధ్వర్యంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్దగల ఆస్థానమండపంలో అఖిల భారత భగవత్‌శాస్త్ర పాంచరాత్ర ఆగమ విద్వత్ సమ్మేళనం శనివారం రెండో రోజుకు చేరుకుంది.
ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన శ్రీ కాండూరు శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ పాంచరాత్ర ఆగమం 108 సంహితల్లో నిక్షిప్తమై ఉందని, ఇందులో నాట్యం, వైద్యం, సంగీతం, జ్యోతిషం, శిల్పశాస్త్రాలు ఇమిడి ఉన్నాయని తెలిపారు. శ్రీ వామనాచార్యులు, శ్రీ భగవద్ రామానుజాచార్యులు, శ్రీ వేదాంత దేశికర్ పాంచరాత్ర ఆగమాన్ని రక్షించారని వివరించారు.
అనంతరం తిరుచానూరుకు చెందిన శ్రీ ప్రతాప్‌స్వామి, శ్రీ ఆర్య స్వామి, తిరుపతికి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహన్‌స్వామి, మైసూరుకు చెందిన శ్రీ గోపాలన్‌స్వామి తదితరులు పాంచరాత్ర ఆగమంలోని వివిధ అంశాలపై ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామ్ అధికారి శ్రీ రాజగోపాల్ రావు, దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు, సమన్వయకర్త శ్రీ పరకాలన్ స్వామి, శ్రీరంగం శ్రీ పాంచరాత్ర ఆగమ సంరక్షణ సభ నిర్వాహకులు శ్రీ రామభట్టర్, కార్యదర్శి శ్రీ జయపాల్, ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ శ్రీ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
Tirupati, 02 December 2023: TTD Pancharatra Agama Advisor Sri Konduru Srinivasacharyulu on Saturday heralded that the dharma path propounded by the Pancharatra Agama guides the devotees towards the path of salvation.
The Akhila Bharat Bhagavad Shastra Pancharatra Agama Vidwat Sammelan jointly promoted by the TTD Alwar Divya Prabandha Project and the Akhila Bharata Bhagavad Shastra Pancharatra Agama Samrakshana Sabha at the Asthana Mandapam in Tiruchanoor entered the second day.
Addressing the sammelan as chief guest the TTD agama advisor said Pancharatra Agama was compiled in 108 sections embedded with ancient knowledge on Nyaya, Vaidya, Sangeeta, Jyotisya and Shilpakala.
He said the Pancharatra Agama has flourished through centuries by pioneer saints like Sri Vamanacharya, Sri Bhagavad Ramanujacharya and Sri Vedanta Desikar and many saints.
Thereafter Vedic exponents like Sri Pratap swami of Tiruchanoor, Sri Lakshmi Narasimha Swamy of Tirupati, Sri Gopalan swami of Mysore and others expounded various facets of the Pancharatra Agama.
TTD Dharmic Projects programs officer Sri Rajagopal Rao, Dasa Sahitya project Special Officer Sri Anandathirthacharyulu, coordinator Sri Parakalan swami, Srirangam Pancharatra agama Samrakshana Sabha organiser Sri Ram Bhattar, secretary Sri Jaspal, Alwar Divya prabanda project coordinator Sri Purushottam and others were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI