PARAYANAMS BOOST SANATANA DHARMA, SAYS KANCHI PONTIFF _ వారణాసిలో పూర్ణాహుతితో ముగిసిన శ్రీ‌నివాస చ‌తుర్వేద హ‌వ‌నం

* SRI SRINIVASA CHATURVEDA HAVANAM CONCLUDES AT VARANASI

Tirumala, 02 August 2023: Kanchi Kamakoti Peethadhipati Sri Sri Sri Vijayendra Saraswati Maha Swami said on Thursday that Parayanams of holy epics like Ramayana, Mahabharata and Bhagavatham enriched and enhanced Dharmic values in society.

Speaking after the concluding session of the week long Havanam at Varanasi, the Kanchi Pontiff complimented the TTD Chairman Sri YV Subba Reddy and EO Sri AV Dharma Reddy for organising such programs which guides society in a righteous path.

He specifically congratulated the TTD for its educational institutions, hospitals, temple construction activities, Dharmic and Bhakti programs.

The Sri Srinivasa Chaturveda Havana program which began at Varanasi on July 28 concluded on Thursday with a grand Purnahuti fete.

The entire Havanam was coordinated and supervised by Dr  Vibhishana Sharma, OSD, SV  Institute of Higher Vedic Studies.

Several union ministers, local legislators and senior officials participated.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

పారాయణాలతో సనాతన ధార్మిక విలువలు పెంపు

– కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి మహాస్వామి

వారణాసిలో పూర్ణాహుతితో ముగిసిన శ్రీ‌నివాస చ‌తుర్వేద హ‌వ‌నం

తిరుమల, 2023 ఆగష్టు 03: రామాయణం, మహాభారతం, భాగవతం లాంటి ఇతిహాసాల పారాయణం వల్ల సమాజంలో ధార్మిక విలువలు పెంపొందుతాయని, ఇలాంటి బృహత్తర కార్యక్రమాలు చేపడుతున్న టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి , ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డిలను అభినందిస్తున్నానని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి మహాస్వామి ఉద్ఘాటించారు.

ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ ఇతిహాసాలు మానవ జాతి ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడానికి శాశ్వత మార్గదర్శకాలన్నారు. టీటీడీ నిర్వహిస్తున్న విద్యాసంస్థలు, ఆసుపత్రులు, దేవాలయాల నిర్మాణాలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలను స్వామీజీ ప్రత్యేకంగా అభినందించారు.

టీటీడీ హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్‌, శ్రీ‌ వేంక‌టేశ్వ‌ర ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ సంయుక్త ఆధ్వ‌ర్యంలో జూలై 28 నుండి ఆగస్టు 3వ తేదీ వ‌ర‌కు వారణాసిలో జ‌రిగిన శ్రీ‌నివాస చ‌తుర్వేద హ‌వ‌నం గురు‌వారం పూర్ణాహుతితో ఘ‌నంగా ముగిసింది. కంచి కామకోట అధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి శీస్సుల‌తో లోక క‌ల్యాణం కోసం 8 రోజుల పాటు ఈ చ‌తుర్వేద హ‌వ‌నం నిర్వ‌హించారు. 8 రోజుల పాటు ఉద‌యం 8 నుండి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు వేద హ‌వ‌నం, సాయంత్రం సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు.

ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ ఆధ్వర్యంలో శ్రీనివాస చతుర్వేద హవనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.