PARENTS THANK CM FOR GIVING A NEW LEASE OF LIFE TO THEIR CHILDREN _ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ మా బిడ్డల ప్రాణాలు కాపాడింది
Dr YSR AROGYASREE SAVED OUR CHILDREN’S LIVES
Tirupati,5,May,2022: During the visit of Honourable CM of AP Sri YS Jaganmohan Reddy to Tirupati on Thursday for Bhoomi Puja of SP Children’s super speciality hospital, the parents of children who were successfully treated for heart ailments free of cost in the hospital expressed their gratitude to him.
We are ever grateful to the Dr YSR Arogyasree scheme which saved the lives of our children. “This is the heartfelt emotional response of parents whose children underwent heart surgeries at Sri Padmavati Children’s super specialty hospital.
During their interaction with the Honourable AP CM Sri YS Jaganmohan Reddy on Thursday during his visit for Bhumi puja for the new building of the Children’s hospital they expressed their gratitude with soul touching words.
CM Jaganmohan Reddy spent some quality time with the children who were successfully treated for heart disorders in the hospital. He took the infants on his hands and kissed them with affection and also blessed them.
The reactions of some of the parents in their words…
Smt Shanti- Bhimavaram
My daughter was prescribed an operation for hole in heart costing over ₹10 lakhs at a private hospital in Bhimavaram. We came to know about this hospital here and doctors admitted our child and performed the surgery without any payment. We are thankful to you sir for this “Life saving” scheme, she maintained with tears oozing out of her eyes with joy.
Lakshmi- Chittoor
We took our son, Jagadeesh to a hospital in Tamilnadu when doctors diagnosed with a hole in heart and said the cost of the operation will be around ₹5 lakhs. With the help of our neighbours, we came here and within 10 days our boy is alright after free operation under Arogyasri Scheme. Thank You So much sir, an emotional mother expressed.
Sri Devi – Gudipala thanked Dr Srinath Reddy and his team for saving her child and giving him rebirth with successful surgery at the Childrens’ Hospital.
Smt Venkatalakshmi-Rajahmundry said we had to go for Cochlear Implantation as my children Gopi, Likhita and Vikhita had hearing impairments and private hospital doctors said it could cost ₹12 lakhs.
In 2007 we met Dr YSR and sought help. And today all my children are healthy. We are ever indebted to Sri YSR. We are happy that Jaganmohan Reddy is following in his father’s footsteps and helping the poor with free medicare.
Yashwant Reddy-a 11 year old from Nagari thanked CM Jaganmohan Reddy “Uncle” that his Cochlear Implant Operation was successfully performed and now he is a normal kid, studying in Hyderabad.
On the occasion of Sri Padmavati Children’s hospital Bhumi puja the TTD Veda pundits showered Veda Ashirvahanam on the Honourable CM.
TTD Chairman Sri YV Subba Reddy felicitated the CM with a shawl and Srivari Prasadam.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ మా బిడ్డల ప్రాణాలు కాపాడింది
– ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డితో చిన్నారుల తల్లిదండ్రుల ముఖాముఖి
తిరుపతి, 2022 మే 05: డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకం తమ బిడ్డల ప్రాణాలు కాపాడిందని ఇందుకు తాము ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి రుణపడి ఉంటామని అపరేషన్లు చేయించుకున్న చిన్నారుల తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి నిర్మాణానికి గురువారం ముఖ్యమంత్రి భూమి పూజ చేసిన సందర్భంగా వారితో ముఖాముఖి జరిపారు. ఈ సందర్భంగా సిఎం చిన్నారులను ఎత్తుకుని ముద్ధాడారు.
శ్రీమతి శాంతి – భీమవరం
మా అమ్మాయికి జబ్బు చేయడంతో భీమవరం ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించాము. గుండెలో రంధ్రం ఉందని విజయవాడలో మంచి ఆసుపత్రికి వెళ్ళి అపరేషన్ చేయించాలని చెప్పారు. ఈ అపరేషన్‌కు రూ.10 లక్షలు ఖర్చు అవుతాయని అక్కడ డాక్టర్లు చెప్పారు. అంత డబ్బు ఖర్చు పెట్టి అమ్మాయికి అపరేషన్ చేయించే శక్తి మాకు లేదు. అమ్మాయి మీద అశలు వదిలేసుకున్నాము.
మాకు తెలిసిన వారు తిరుపతిలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిన్న పిల్లల గుండె ఆసుపత్రి పెట్టించారని అక్కడికి వెళితే ఉచితంగా అపరేషన్ చేస్తారని చెప్పారు. మేము తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె ఆసుపత్రికి బిడ్డను తీసుకుని వచ్చాము. డాక్టర్లు అడ్మిట్ చేసుకుని ఆరోగ్య శ్రీ కింద రూపాయి ఖర్చు లేకుండా అపరేషన్ చేసి మా అమ్మాయిని బతికించారు. డాక్టర్లు చాలా బాగా చూసుకున్నారు. మా అమ్మాయి ప్రాణాలతో ఉందంటే జగన్ మోహన్ రెడ్డి చలువే. ఆరోగ్య శ్రీ లేకపోతే చాలా మంది బతికేవాళ్ళే కాదు.
లక్ష్మీ – చిత్తూరు
మా బాబుకు గుండెలో రంధ్రం ఉందని డాక్టర్లు చెప్పారు. తమిళనాడులోని ఆసుపత్రికి తీసుకుపోతే అపరేషన్‌కు రూ.5 లక్షలు అవుతుందని డాక్టర్లు చెప్పారు. మాకు అంత డబ్బు ఖర్చు పెట్టి అపరేషన్ చేయించే శక్తి లేదు. మాకు తెలుసిన వాళ్ళు తిరుపతిలో ఉచితంగా గుండె అపరేషన్లు చేసే ఆసుపత్రి టీటీడీ పెట్టిందని చెప్పారు. బాబును శ్రీ పద్మావతి గుండె ఆసుపత్రికి తీసుకుని వచ్చాము. డాక్టర్లు 10 రోజుల్లో అపరేషన్ చేసి మా బాబును బతికించారు. ఆరోగ్య శ్రీ కింద ఒక రూపాయి ఖర్చు కాకుండా ఈ అపరేషన్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము.
శ్రీదేవి – గుడిపాల
మా బాబు జగదీష్‌కు గుండెలో హోల్ ఉందని డాక్టర్లు చెప్పారు. అనంతపురంలోని ఆసుపత్రికి తీసుకుపోతే అపరేషన్‌కు రూ.5 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. మాకు అంత డబ్బు ఖర్చు పెట్టి అపరేషన్ చేయించే శక్తి లేదు. తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె ఆసుపత్రికి బాబును తీసుకువచ్చాము. ఆరోగ్య శ్రీ కింద ఒక రూపాయి ఖర్చు కాకుండా డాక్టర్లు అపరేషన్ చేశారు. మా బాబు బతికాడంటే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పుణ్యమే.
శ్రీమతి వెంకటలక్ష్మీ – రాజమండ్రి
మా బిడ్డలు అన్నమరెడ్డి గోపి, లిఖిత, విఖిత ముగ్గురికి చెవుడు ఉండటంతో వారికి కాక్లియర్ ఇన్ ప్లాంట్స్ సర్జరీ చేయించాలనుకున్నాము. సుమారు రూ.12 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు. 2007లో ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డిని కలిసి సహాయం చేయాలని కోరాము. ఆరోగ్య శ్రీ కింద కుటుంబంలో ఒకరికే ఈ అపరేషన్ చేసే అవకాశం ఉన్నా ఆయన ప్రత్యేకంగా సహాయం చేసి మాముగ్గురు పిల్లలకు అపరేషన్ చేయించడానికి సహకరించారు. ఆయన దయ వల్ల ముగ్గురు పిల్లలు బాగా చదువుకుంటున్నారు. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి మార్గంలోనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేదలకు పెద్ద ఎత్తున వైద్య సహాయం అందిస్తున్నందుకు కృతజ్ఞతలు.
యశ్వంత్ రెడ్డి – నగరి
జగన్ అంకుల్ సహయంతో నేను కాక్లియర్ ఇన్‌ప్లాంటేషన్ సర్జరీ చేయించుకున్నాను. ఇప్పుడు నేను అందరి లాగే వినగలుగుతున్నాను. హైదరాబాద్‌లో చదువుకుంటున్నాను. జగన్ అంకుల్‌కు కృతజ్ఞతలు.
సిఎంకు వేద ఆశీర్వచనం
ఈ సందర్బంగా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్.జగన్ మోహన్ రెడ్డికి టీటీడీ వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. టీటీడీ చైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి ముఖ్యమంత్రిని శాలువతో సన్మానించి శ్రీవారి ప్రసాదాలు అందించారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.