PARLIAMENTARY COMMITTEE LAUDS TTD’s EFFECTIVE PILGRIM MEASURES _ భ‌క్తుల‌కు క‌ల్పిస్తున్న సౌక‌ర్యాలు భేష్‌ -⁠టీటీడీకి హోం వ్య‌వ‌హారాల పార్ల‌మెంట‌రీ క‌మిటీ అభినంద‌న

TIRUMALA, 20 FEBRUARY 2024: The team of Parliamentary Standing Committee on Home Affairs led by its Chairman Sri Brijlal has lauded the effective pilgrim welfare and security measures taken up by Tirumala Tirupati Devasthanams(TTD).

During their two day visit to the pilgrim centre, the Parliamentary Committee was explained about the various socio-economic-religious activities taken up by TTD since its inception and progressive methodologies adopted in the last nine decades by the TTD EO Sri AV Dharma Reddy with the help of a 40-minute AV on TTD at Annamaiah Bhavan in Tirumala on Tuesday. 

Later sharing their experience to the media, the Committee Chairman said, it was a great experience to have the Darshan of Sri Venkateswara Swamy. He also appreciated the effective pilgrim crowd management practices, sanitation, security measures, and Disaster Management Plan system adopted by TTD keeping in view the safety and security of its employees, pilgrims, and ecology.

The Committee members includes, Sri Biplav Kumar Dev, Sri Neeraj Sekhar, Sri Dilip Ghosh, Sri Dulalchandra Goswami, Sri Raja Amareswara Naik, Dr Satyapal Singh, Dr Nishikant Dube and other officials from the department of Home Affairs. 

JEO Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, Joint Collector Sri Subham Bansal and SP Smt Mallika Garg and other senior officers from TTD, district, police departments have also participated.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

భ‌క్తుల‌కు క‌ల్పిస్తున్న సౌక‌ర్యాలు భేష్‌

•⁠ ⁠టీటీడీకి హోం వ్య‌వ‌హారాల పార్ల‌మెంట‌రీ క‌మిటీ అభినంద‌న‌

తిరుమల, 2024 ఫిబ్రవరి 20: శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం దేశం న‌లుమూల‌ల నుండి విచ్చేస్తున్న భ‌క్తుల‌కు టీటీడీ ద‌ర్శ‌నం, అన్న‌ప్ర‌సాదాలు, గ‌దులు త‌దిత‌ర సౌక‌ర్యాలను చ‌క్క‌గా క‌ల్పిస్తోంద‌ని శ్రీ బ్రిజ్‌లాల్ అధ్య‌క్ష‌త‌న గ‌ల భార‌త హోం వ్య‌వ‌హారాల పార్ల‌మెంట‌రీ స్టాండింగ్ క‌మిటీ అభినందించింది. క‌మిటీ స‌భ్యులు మంగ‌ళ‌వారం తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో టీటీడీ అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి టీటీడీ ఆవిర్భావం నుండి చేప‌డుతున్న వివిధ సామాజిక, ధార్మిక, సంక్షేమ‌ కార్యకలాపాలను 40 నిమిషాల ఆడియో విజువ‌ల్ ప్ర‌జంటేష‌న్ ద్వారా వివరించారు.

అనంత‌రం క‌మిటీ ఛైర్మన్‌ మీడియాతో మాట్లాడుతూ శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం గొప్ప అనుభూతిని మిగిల్చింద‌న్నారు. శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం వ‌స్తున్న యాత్రికుల‌ను, తిరుమ‌ల ప‌ర్యావ‌ర‌ణాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ చేప‌డుతున్న చ‌ర్య‌లు బాగున్నాయ‌ని చెప్పారు. భ‌క్తుల ర‌ద్దీ క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌ పద్ధతులు, పారిశుద్ధ్యం, భద్రతా చర్యలు, విపత్తుల‌ నిర్వహణ ప్రణాళికల‌ను ప్రశంసించారు.

కమిటీ సభ్యులు శ్రీ బిప్లవ్ కుమార్ దేవ్, శ్రీ నీరజ్ శేఖర్, శ్రీ దిలీప్ ఘోష్, శ్రీ దులాల్ చంద్ర గోస్వామి, శ్రీ రాజా అమరేశ్వర నాయక్, డాక్టర్ సత్యపాల్ సింగ్, డాక్టర్ నిషికాంత్ దూబే, హోం వ్యవహారాల శాఖకు చెందిన ఇతర అధికారులతో పాటు టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్‌వో శ్రీ నరసింహ కిషోర్, జాయింట్ కలెక్టర్ శ్రీ శుభం బన్సల్, ఎస్పీ శ్రీమతి మలికా గార్గ్, టీటీడీ, జిల్లా, పోలీసు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.