PARUVETA UTSAVAM HELD IN EKANTAM _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఏకాంతంగా పార్వేట ఉత్సవం

Tirupati, 17 Jan. 22: The Paruveta Utsavam was observed in Ekantam in Sri Govindaraja Swamy temple in Tirupati on Monday.

 

Every year the day after Kanuma, this festival is observed in Sri GT.

 

On Monday evening between 4pm and 5pm the processional deities of Sri Govinda Raja Swamy, Sridevi, Bhudevi and Sri Andal Godai were paraded inside temple prakaram and later Asthanam was performed in Kalyana Mandapam.

 

Temple Special Grade DyEO Sri Rajendrudu, Chief Priest Sri Srinivasa Deekshitulu, AEO Sri Ravi Kumar Reddy and others were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఏకాంతంగా పార్వేట ఉత్సవం

తిరుపతి, 2022 జనవరి 17: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో సోమవారం సాయంత్రం పార్వేట ఉత్సవం ఏకాంతంగా జరిగింది. ప్రతి ఏడాది కనుమ పండుగ మరునాడు పార్వేట ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సంద‌ర్భంగా సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారిని, శ్రీ ఆండాళ్ అమ్మ‌వారిని ఆలయంలోని విమాన ప్రాకారంలో ఊరేగించి, క‌ల్యాణ‌మండ‌పంలో ఆస్థానం నిర్వ‌హించారు. అనంత‌రం తిరిగి ఆల‌యానికి చేరుకున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ రవికుమార్ రెడ్డి, ప్రధాన అర్చకులు శ్రీ శ్రీనివాస దీక్షితులు, సూపరింటెండెంట్‌ శ్రీ నారాయణ, టెంపుల్ ఇన్సెక్టర్ శ్రీ కామ‌రాజు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.