PARUVETA UTSAVAM HELD _ వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం

TIRUPATI, 06 JULY 2022: The annual Paruveta Utsavam was held with celestial fervour at Paruveta Mandapam near Srivari Mettu in Srinivasa Mangapuram on Wednesday.

 

This event has taken place after a gap of two years due to the Covid Pandemic.

 

The mock hunt fete was enacted where in Sri Kalyana Venkateswara threw His weapons at the wild beasts and protected His devotees.

 

Devotional cultural programmes were organized on the occasion. Later Annaprasadams were distributed.

 

Spl Gr DyEO Smt Varalakshmi, VGO Sri Manohar, AEO Sri Gurumurthy, Archaka Sri Balaji Rangacharyulu and others, large gathering of devotees were also present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం

జులై 06, తిరుప‌తి, 2022: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం బుధ‌వారం శ్రీవారి మెట్టు సమీపంలో వైభవంగా జరిగింది.

ముందుగా ఉదయం ఆలయం నుంచి ఉత్సవమూర్తుల ఊరేగింపు శ్రీవారిమెట్టు సమీపంలోని పార్వేట మండపానికి చేరుకుంది. అక్కడ క్షేమతలిగ నివేదన చేసి పార్వేట ఉత్సవం నిర్వహించారు. ఇందులో దుష్టశిక్షణ కోసం స్వామివారు మూడు సార్లు బళ్లెం ప్రయోగించారు. ఆస్థానం అనంతరం ఉత్సవమూర్తులను తిరిగి ఆలయానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అన్న‌మాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు. భజన బృందాలు భజనలు, కోలాటాలు చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, విజివో శ్రీ మ‌నోహ‌ర్‌, ఏఈవో శ్రీ గురుమూర్తి, ఆలయ అర్చకులు శ్రీ బాలాజీ రంగాచార్యులు, సూప‌రింటెండెంట్లు శ్రీ ముని చెంగ‌ల్రాయులు, శ్రీ ర‌మ‌ణ‌య్య‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శ్రీ‌నివాసులు ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.