PARUVETA UTSAVAM ON JAN 16_ జనవరి 16న పార్వేట ఉత్సవం, శ్రీ పురందరదాస ఆరాధనోత్సవం

Tirumala, 2 January 2018: The devotees will have a triple bonanza on January 16 as there are threecelestial festivals that are being observed in hill temple on the auspicious occasion of Kanuma.

On this day, in the morning Goda Parinayotsavam is observed inside temple while Paruveta Utsavam in Paruveta Mandapam. After the hectic mock hunting schedule, the processional deity of Sri Malayappa Swamy along with His consorts will be taken to Narayanagiri Gardens in the evening at around 6pm and Purandhara Dasa Aradhana Mahotsavams will be observed.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUMALA

జనవరి 16న పార్వేట ఉత్సవం, శ్రీ పురందరదాస ఆరాధనోత్సవం

తిరుమల, 2018 జనవరి 02: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం సంక్రాంతి కనుమ పండుగనాడైన జనవరి 16న అత్యంత ఘనంగా జరగనుంది. అదేరోజున గోదాపరిణయోత్సవం విశేషంగా నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా మధ్యాహ్నం 1 గంటకు శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ కృష్ణస్వామివారు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఆస్థానం, పారువేట కార్యక్రమాలు నిర్వహిస్తారు.

పురందాస ఆరాధనోత్సవం :

ప్రముఖ కన్నడ సంగీత పదకవితా పితామహుడయిన శ్రీ పురందరదాస ఆరాధన మహోత్సవాన్ని జనవరి 16న తిరుమలలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సాయంత్రం 6 గంటలకు నారాయణగిరి ఉద్యానవనాలకు శ్రీవారి ఆలయం నుండి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకెళ్లి ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. ఇందులో ప్రముఖ కళాకారులు పాల్గొని శ్రీ పురందరదాస కీర్తనలను గానం చేస్తారు. టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.

ఆర్జితసేవలు రద్దు :

ఈ ఉత్సవాల కారణంగా జనవరి 16న శ్రీవారి ఆలయంలో నిర్వహించే తోమాలసేవ, అర్చన, అష్టదళపాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, మరియు సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.