PATTABISHEKAM UTSAVA OF VALMIKIPURAM SRI PR TEMPLE ON AUGUST 14-15 _ ఆగస్టు 14, 15వ తేదీల్లో వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు

ఆగస్టు 14, 15వ తేదీల్లో వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు

 తిరుపతి, 2021 ఆగ‌స్టు 08: టిటిడికి అనుబంధంగా ఉన్న చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు ఆగస్టు 14, 15వ తేదీల్లో జరుగనున్నాయి. ఆగస్టు 13న సాయంత్రం అంకురార్పణం, సేనాధిప‌తి ఉత్స‌వంతో ఈ ఉత్సవాలు ప్రారంభ‌మ‌వుతాయి. కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఈ ఉత్స‌వాల‌ను ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

ఆగస్టు 14వ తేదీన ఉదయం యాగశాల పూజ, హోమం, స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు ఊంజల్‌సేవ, 6 గంటలకు శ్రీ సీతారామ శాంతి కళ్యాణం, రాత్రి 8 గంటలకు హనుమంత వాహనసేవ జ‌రుగ‌నున్నాయి.

ఆగస్టు 15న ఉదయం స్నపనతిరుమంజనం, యాగశాల పూజ నిర్వహిస్తారు. ఉద‌యం 9 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం జరుగనుంది. రాత్రి 6 గంటలకు ఊంజల్‌ సేవ, రాత్రి 7 గంటలకు గరుడ వాహనసేవ నిర్వ‌హిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Tirupati, 8 August 2021:  TTD is organising grand Pattabishekam utsava on August 14-15 at the Sri Pattabirama temple in the TTD local temple at Valmikiouram village, Chittoor district in Ekantha as per Covid guidelines.

As part of festivities the Ankurarpanam ritual with Senadhipati utsava shall be held on August 13 inside the temple

On August 14, Snapana thirumanjanam shall be held for utsava idols in the yagashala after puja and Homa. Later in the evening, Unjal Seva followed by Sri Sitaram Shanti Kalyanam shall be grandly conducted and thereafter at night, the auspicious Hanumanta vahana Seva is held to the delight of devotees.

On August 15 morning Snapana thirumanjanam and yagashala puja are conducted ahead of the majestic festivities of Sri Rama Pattabisekam.

The celebrations will conclude with Unjal seva and Garuda vahana seva in the night.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI