PAVITHROSAVAM OF SRI KALYANA VENKATESWARA SWAMY TEMPLE IN SRINIVASA MANGAPURAM FROM OCTOBER 21 – NOVEMBER 2 _ అక్టోబ‌రు 31 నుండి న‌వంబ‌రు 2వ తేదీ వ‌ర‌కు శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు

Tirupati, 21 Oct. 21: TTD is organising a three-day celebration of the annual Pavitrotsavam at Sri Kalyana Venkateswara Temple, Srinivasa Mangapuram from October 31- November 2 in Ekantham as per covid guidelines and Ankurarpanam fete on October 30.

Legends say that Pavitrotsavam is organised after annual Brahmotsavam at all Vaishnavite temples to make temples sin-free in view of possible lapses committed either by devotees or staff or Archakas throughout the year.

The prominent programs observed during the three-day event include Pavitra pratista, Pavitra samarpana and Purnahuti at temple Yagashala. Similarly, the highlight of the Vedic rituals is the conduction of Snapana thirumanjanam for utsava idols of Sri Kalyana Venkateshwara and his consorts Sri Sridevi and Bhudevi and daily Asthana in the evening.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అక్టోబ‌రు 31 నుండి న‌వంబ‌రు 2వ తేదీ వ‌ర‌కు శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు

తిరుపతి, 2021 అక్టోబరు 21: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 31 నుండి న‌వంబ‌రు 2వ తేదీ వరకు ప‌విత్రోత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ప‌విత్రోత్స‌వాలు ఏకాంతంగా జ‌రుగ‌నున్నాయి.

ఇందులో భాగంగా అక్టోబరు 30వ తేదీన ఉద‌యం 7 గంట‌ల‌కు ఆచార్య రుత్విక్‌వ‌ర‌ణం, సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వ‌ర‌కు మత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణంతో ఈ ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి.

పవిత్రోత్సవాల్లో మొదటిరోజైన అక్టోబరు 31వ తేదీన ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు పవిత్రప్రతిష్ఠ నిర్వహించనున్నారు. రెండో రోజు నవంబరు 1వ తేదీన మధ్యాహ్నం 12.00 నుండి 1.00 గంట వరకు పవిత్ర సమర్పణ చేస్తారు. చివరిరోజు నవంబరు 2వ తేదీ సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.

పవిత్రోత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు ఉదయం 11 నుండి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు స్వామి, అమ్మవార్ల‌కు ఆల‌యంలో ఆస్థానం జ‌రుగ‌నుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.