PAVITROTSAVAMS IN SRI PAT_ వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ పవిత్రోత్సవాలు ప్రారంభం

Tiruchanoor, 23 September 2018: The annual pavitrotsavams commenced on a grand religious note in Sri Padmavathi Ammavari temple in Tiruchanoor.

Snapana Tirumanjanam was performed to processional deity of Ammavaru in Sri Krishna Swamy mandalam. Dhwajakumbha puja, Chatusthanarchana and Pavitra Pratishta were performed.

Grihastas who would like to take part in this fete will have to pay Rs.750 per ticket on which two persons can take part. Two laddu and two vada will be presented to Grihastas.

Spl Gr DyEO Sri Munirathnam Reddy, AEO Sri Subramanyam, Suptd Smt Malleswarai, Temple Inspector Sri Guruvaiah and devotees took part.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ పవిత్రోత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2018 సెప్టెంబరు 23: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మొదటిరోజు శ్రీ పద్మావతి అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఆలయం నుండి యాగశాలకు వేంచేపు చేశారు. అనంతరం ద్వారతోరణ ధ్వజకుంభ ఆవాహనం, చక్రాధి మండలపూజ, చతుస్థానార్చన, అగ్నిప్రతిష్ఠ, పవిత్రప్రతిష్ఠ నిర్వహించారు.

మధ్యాహ్నం శ్రీకృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, కొబ్బనీళ్లతో, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేశారు. రూ.750/- చెల్లించి గృహస్తులు (ఒకరికి మూడు రోజులపాటు) ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు 2 లడ్డూలు, 2 వడలు బహుమానంగా అందజేస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ప్రత్యేకశ్రేణి డెప్యూటి ఈఓ శ్రీ మునిరత్నంరెడ్డి, ఎఇఓ శ్రీసుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీమతి మల్లీశ్వరి, టెంపుల్‌ ఇన్స్‌పెక్టర్‌ శ్రీ గురవయ్య తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.