CELESTIAL PAVITHROTSAVAM BEGINS AT SRI KODANDARAMA SWAMY TEMPLE, CHANDRAGIRI_ చంద్రగిరిలోని శ్రీ కోదండరామాలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు ప్రారంభం

Tirupati, 11 October 2017: The Celestial three day Pavitrotsavam utsavam began this morning at the TTD sub temple of Sri Kodandarama Temple at Chandragiri with an intent to ward off impact of lapses committed by temple staff and devotees inside the temple during the year.

Day one rituals included Suprabatham , Sahasra namarchana , pavitra pratistha, Chatustarchana, Sitarama Lakshmana utsava idols installed in yaga shala and conduction of snapana thirumanjanam in the afternoon with milkcurd,honey, coconut water,turmeric and sandal paste. Interested devotee couple could participate with payment of Rs.200 and beget Pavitra mala, thirtha prasadams

TTD local temples Dy EO Sri Venkataiah AEO Sri Dhanajayelu, Kankana bhattar Sri Krishna bhat, Temple inspector Kum. Lelasri, other officials and devotees

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD,TIRUPATI

చంద్రగిరిలోని శ్రీ కోదండరామాలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2017 అక్టోబరు 11: టిటిడి అనుబంధ ఆలయమైన చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు బుధవారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలిసి కొన్ని, తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

మొదటిరోజు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 9.00 నుండి 11.30 గంటల వరకు చతుష్టార్చన, పవిత్ర ప్రతిష్ట నిర్వహించారు. అనంతరం సీతారామ సమేత లక్ష్మణస్వామివారి ఉత్సవమూర్తులను విమాన ప్రదక్షిణగా యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ మధ్యాహ్నం 11.30 నుండి 12.30 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు పవిత్ర హోమాలు నిర్వహిస్తారు.

గృహస్తులు(ఇద్దరు) రూ.200/- చెల్లించి పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక పవిత్రమాల, తీర్థప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీ వెంకటయ్య, ఏఈవో శ్రీధనంజయులు, కంకణభట్టర్‌ శ్రీ కృష్ణభట్టర్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ కుమారి లీనశ్రీ, ఇతర అధికార ప్రముఖులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.