PAVITHROTSAVAM ENDS IN SRI PAT_ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు

Tiruchanoor, 14 Sep. 19: The three day festival of annual Pavitrotsavams concluded at the TTD local temple of Sri Padmavathi Ammavaru in Tiruchanoor on Saturday with the Maha Purnahuti, Pavitra Visarjana and special pujas.

The TTD organised snapana thirumanjanam in the afternoon and grand Chakra snanam event was also held in Padmavathi Pushkarani followed by the procession of utsava idols of Padmavathi ammavaru, Sri Krishna Swamy and Sri Sundararaja Swamy on Mada streets.

DyEO Smt Jhansi Rani, AEO Sri Subramanyam, Superintendent Smt Malleswari, Arjitam Inspector Sri Kola Srinivasulu and others participated.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు

సెప్టెంబర్ 14, తిరుపతి, 2019: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల‌పాటు జ‌రిగిన ప‌విత్రోత్స‌వాలు శ‌నివారం మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జనంతో ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చివరిరోజు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఉదయం శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి, శాంతి హోమం, పవిత్ర విసర్జనం, కుంభప్రోక్షణ, నివేదన నిర్వహించి తీర్థప్రసాద వినియోగం చేశారు.

వైభవంగా చక్రస్నానం:

మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5 గంటల వరకు అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, కొబ్బరినీళ్లు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారి పద్మపుష్కరిణిలో చక్రస్నానం వైభవంగా జరిగింది.

సాయంత్రం శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీకృష్ణస్వామివారు, శ్రీ సుందరరాజ స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో వైభవంగా ఊరేగింపు నిర్వహిస్తారు. రాత్రి రక్షాబంధనం, ఆచార్య, ఋత్విక్‌ సన్మానంతో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ మల్లీశ్వరి, ఆర్జితం ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కోలా శ్రీనివాసులు ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.