PAVITRA MALA OFFERED TO DEITIES_ శ్రీవారి ఆలయంలో వైభవంగా పవిత్రాల సమర్పణ

Tirumala, 12 Aug. 19: As a part of annual pavitrotsavams on the second day, Pavitra Malas were offered to different deities in the sanctum of Tirumala temple on Monday.

In the Agama Jargon, the entire process is known as Pavitra Mala Samarpana. These Pavitra Garlands are the purest and sacred and are knitted out in pure silk using natural colour dyes. In ancient literature, there is description of the different bhavas of pavitra.

SIGNIFICANCE OF COLOURS

Kesri coloured pavitra represents satvik bhava, white and red represents rajas bhava, green coloured is tamas bhava and sky blue is nirguna bhava. Hence, five coloured pavitra represents the bhava of all the devotees. The tradition of pavitra has come down from ancient times.

ABOUT 80 PAVITRAMS ADORN DIFFERENT DEITIES

In totto nearly 80 Pavitrams are adorned to different murthies in the temple and also outside. These includes, Moolavarlu – 8, Bogasrinivasa-1 Koluvu Moorthy -1, Ugrasrinivasa Moorthy -3, Ramula varu -3, Krishna swmay -2, Chakrtalwar 1, Jaya Vijaya-2, Garudalwar-1, Varadarajasway-1, Potu Tayar-1, Vimanam-6, Parivara Devathalu -6, Viswachenulavaru- 1, Yoga Narasimha Swamy -1, Bhashyakarulavaru-2, Padi Potu Tayar- 1, Yamunathorai-5, Dhwajastamambham-2 , Balipeetam- 1, Varahaswmay moolavarlu -1, Utsavarlu 2, Jaya Vijaya 2, Viswaksenulavaru and bashaykarulavaru utsavarulu-2,koneru anjaneyaswamy -1, Bedi anjaneyaswamy 1, Sri Malayappa Swamy 3, Pradana kumbam- 3, Parivara kumbam-16 and Homagundams.

TTD EO Sri Anil Kumar Singhal speaking to media outside the temple after the ceremony said, the history of Pavitrotsavams in Tirumala way backs to 1464AD where in for the first time Saluva Mallyadevaraya conducted this festival as per available inscriptional evidences. He said this festival is observed to remove the evil effects and maintain high level spiritual atmosphere in the temple.

CVSO Sri Gopinath Jatti, Temple DyEO Sri Harindranath and other officers also took part in this celestial fete.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI<

శ్రీవారి ఆలయంలో వైభవంగా పవిత్రాల సమర్పణ

తిరుమ‌ల‌, 2019 ఆగస్టు 12: తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాల సందర్భంగా సోమ‌వారం వైభవంగా పవిత్ర సమర్పణ జరిగింది. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్ పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మీడియాతో ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలిసి, తెలియక జ‌రిగిన‌ దోషాల నివార‌ణ‌కు ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్న‌ట్టు తెలిపారు. తిరుమలలో 15వ‌ శతాబ్దం వరకు పవిత్రోత్సవాలు జరిగినట్టు ఆధారాలున్నాయ‌ని, 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించిందని వివ‌రించారు. ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఉదయం స్నపనతిరుమంజనం నిర్వ‌హిస్తున్నామ‌ని, సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తున్నార‌ని చెప్పారు. మంగ‌ళ‌వారం పూర్ణాహుతితో ప‌విత్రోత్స‌వాలు ముగియ‌నున్న‌ట్టు తెలిపారు. భ‌క్తుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో ఎక్కువ స‌మ‌యం సామాన్య భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం కల్పిస్తున్నామ‌ని వెల్ల‌డించారు.

ప‌విత్రోత్స‌వాల్లో రెండో రోజు ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుంగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం వేద ఘోష, మంగళవాయిద్యాల నడుమ శ్రీవారి మూలవర్లకు 8, భోగ‌శ్రీ‌నివాస‌మూర్తికి 1, కొలువు శ్రీ‌నివాస‌మూర్తికి 1, ఉగ్ర‌శ్రీ‌నివాస‌మూర్తికి 3, శ్రీ రాముల‌వారికి 3, శ్రీకృష్ణ‌స్వామివారికి 2, చ‌క్ర‌త్తాళ్వార్‌కు 1, జ‌య విజ‌యుల‌కు 2, గ‌రుడాళ్వార్‌కు 1, శ్రీ వ‌ర‌ద‌రాజ‌స్వామివారికి 1, పోటు తాయారుకు 1, ఆనంద నిల‌య విమానానికి 6, ప‌రివార దేవ‌త‌ల‌కు 6, విష్వ‌క్సేనుల‌వారికి 1, శ్రీ యోగ‌న‌ర‌సింహ‌స్వామివారికి 1, భాష్యకార్ల‌కు 2, ప‌డిపోటు తాయారుకు 1, య‌మునోత్త‌రైకి 5, ధ్వ‌జ‌స్తంభానికి 2, బ‌లిపీఠానికి 1, శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారికి 3, ప్ర‌ధాన కుంభానికి 3, ప‌రివార కుంభాల‌కు 16 ప‌విత్రమాల‌లు స‌మ‌ర్పించారు. అదేవిధంగా, శ్రీ‌ వ‌రాహ‌స్వామివారి ఆల‌యంలో మూల‌వ‌ర్ల‌కు 1, ఉత్స‌వ‌ర్ల‌కు 2, జ‌య‌విజ‌యుల‌కు 2, విష్వ‌క్సేనుల‌వారికి భాష్య‌కార్ల‌కు క‌లిపి 2, కోనేరు ఆంజ‌నేయ‌స్వామివారికి 1, శ్రీ‌ బేడి ఆంజనేయస్వామివారికి 1 పవిత్రమాలలు సమర్పించారు.

చారిత్రక ఆధారాల ప్రకారం శ్రీస్వామివారి ఉత్సవమూర్తులకు కావలసిన పవిత్రాలు చేయడానికిగాను శ్రేష్టమైన జాతి పత్తి మొక్కలను అత్యంత పవిత్రమైన దైవమొక్కగా భావించే తులసి పెంచడానికి ఉపయోగించే పెరటి భూమిలో పెంచడం విశేషం. పవిత్రాలను తయారు చేయడానికి 20 మూరల పట్టుదారం గానీ లేదా 200 మూరల నూలుదారం గానీ ఉపయోగిస్తారు. ఈ దారాలకు తెలుపుతో పాటు నలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగులు అద్దకం చేస్తారు.

సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆభరణాలతో సళ్లింపు నిర్వహిస్తారు. రాత్రి 8 నుంచి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి. పవిత్రోత్సవాల కారణంగా విశేష‌పూజ‌, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకారసేవ రద్దయ్యాయి.

ఈ కార్యక్రమంలో సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, విఎస్వోలు శ్రీ మ‌నోహ‌ర్‌, శ్రీ ప్ర‌భాక‌ర్‌, పేష్కార్‌ శ్రీ లోక‌నాథం ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.