PAVITRA SAMARPANA HELD _ శ్రీవారి ఆలయంలో వైభవంగా పవిత్రాల సమర్పణ
TIRUMALA, 09 AUGUST 2022: As part of the three day annual Pavitrotsavams, on second day on Tuesday, Pavitra Samarpana was held with religious fervour.
Earlier during the day Snapana Tirumanjanam was held to utsava murthies of Sri Malayappa wirh Sridevi and Bhudevi. Later Pavita Malaa were decorated to other Parivara Devatas apart from prime deities.
Both the Senior and Junior Pontiffs of Tirumala, EO TTD Sri AV Dharma Reddy, Temple DyEO Sri Ramesh Babu and others were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి ఆలయంలో వైభవంగా పవిత్రాల సమర్పణ
తిరుమల, 2022 ఆగస్టు 09: తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాల సందర్భంగా మంగళవారం వైభవంగా పవిత్ర సమర్పణ జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి దంపతులు పాల్గొన్నారు.
ఇందులో భాగంగా రెండో రోజు ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం వేద ఘోష, మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి మూలవర్లకు, ఉత్సవమూర్తులకు, ఆలయంలోని ఇతర పరివార దేవతలకు, ధ్వజస్తంభానికి, శ్రీభూవరాహస్వామివారికి, శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి పవిత్రమాలల సమర్పణ కార్యక్రమం నిర్వహించారు.
చారిత్రక ఆధారాల ప్రకారం శ్రీ స్వామివారి ఉత్సవమూర్తులకు కావలసిన పవిత్రాలు చేయడానికిగాను శ్రేష్టమైన జాతి పత్తి మొక్కలను అత్యంత పవిత్రమైన దైవమొక్కగా భావించే తులసి పెంచడానికి ఉపయోగించే పెరటి భూమిలో పెంచడం విశేషం. పవిత్రాలను తయారు చేయడానికి 20 మూరల పట్టుదారం గానీ లేదా 200 మూరల నూలుదారం గానీ ఉపయోగిస్తారు. ఈ దారాలకు తెలుపుతో పాటు నలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగులు అద్దకం చేస్తారు.
సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రి 8 నుంచి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రమేష్‌బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.