PAVITRA SAMARPANA HELD AT SRI GT _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ

Tirupati, 29 Aug. 20: As part of ongoing Pavitrotsavams at the Sri Govindarajaswami temple, the Pavitramala samarpana ritual was performed on Saturday morning after the Nitya puja.

Earlier, Snapana Tirumanjanam was performed at the temple Yagashala for the utsava idols of Sri Govindarajaswami and His consorts in the afternoon.

Later on Pavitra samarpana was done to main idols, utsava idols, Dhwajasthambham, Sri Matham Anjaneya idol etc.

Tirumala pontiffs Sri Sri Sri Pedda Jeeyarswami, Sri Sri Sri Chinna Jeeyarswami, Special Grade Dyeo Smt Varalakshmi and others also participated. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ

తిరుపతి, 2020 ఆగ‌స్టు 29: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా శ‌నివారం ఉద‌యం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు.  

ఇందులో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవింద‌రాజ‌స్వామివారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆ త‌రువాత స్నపనతిరుమంజనం వేడుక‌గా జరిగింది. ఇందులో భాగంగా ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, కొబ్బరినీళ్లు, తేనె, చందనంతో అభిషేకం నిర్వహించారు.

అనంతరం మూలవర్లకు, ఉత్సవర్లకు, ఉప ఆలయాలకు, ప‌రివార దేవ‌త‌ల‌కు విమానప్రాకారానికి, ధ్వజస్తంభానికి, శ్రీ మఠం ఆంజనేయస్వామివారికి పవిత్రాలు సమర్పించారు.

ఈ కార్య్ర‌క‌మంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ్య‌ర్ స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న జీయ్య‌ర్ స్వామి, ఆల‌య ప్ర‌త్యేక శ్రేణి  డెప్యూటి ఈవో శ్రీ‌మ‌తి వ‌ర‌ల‌క్ష్మీ, సూపరింటెండెంట్లు శ్రీరాజ్‌కుమార్‌, శ్రీ శ‌ర్మ‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ కృష్ణ‌మూర్తి, శ్రీ మునేంద్ర‌బాబు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.