PAVITRAMALA SAMPARPANA AT VONTIMITTA TEMPLE _ ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ
Tirupati, 8 September 2021: As part of second day celebrations of Pavitrotsavam on Wednesday morning, TTD organised Pavitramala Samarpana fete at Sri Kodandarama Swamy Temple in Vontimitta of YSR Kadapa district.
Earlier the utsava idols of Sri Sita Lakshmana sameta Sri Rama Chandra Murthy were brought to yagashala for performing Bala Bhog, Chatusrarchanam, Pavitra Homas, Madhyanna Aradhana, Bari Harana and Sattumora rituals.
Later Pavitra mala samarpana was performed to Dhruva murtis, Kauthuka murtis, Snapana murtis, Bali murtis, Viswaksena, Dwara palakas, Garudalwar, Dwaja Sthambham and Anjaneya Swami in front of temple. This was followed by Pavitra Homas, Nivedana and Sattumora fete in the evening.
Temple AEO Sri Muralidhar, Superintendent Sri Venkatesh, Kankana Bhattar Sri Rajesh Swami were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ
తిరుపతి, 2021 సెప్టెంబరు 08: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధవారం పవిత్ర సమర్పణ శాస్త్రోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేశారు. ఉదయం బాలబోగం, చతుష్టానార్చన, పవిత్ర హోమం, మధ్యాహ్న ఆరాధన, బరిహరణ, శాత్తుమొర చేపట్టారు.
ఈ సందర్భంగా యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షిణగా సన్నిధికి వేంచేపు చేశారు. ధ్రువమూర్తులకు, కౌతుకమూర్తులకు, స్నపనమూర్తులకు, బలిమూర్తులకు, విష్వక్సేనులవారికి, ద్వారపాలకులకు, గరుడాళ్వార్‌కు, యాగశాలలోని హోమగుండాలకు, బలిపీఠానికి, ధ్వజస్తంభానికి, ఆలయం ఎదురుగా గల ఆంజనేయస్వామివారికి పవిత్రాలు సమర్పించారు. సాయంత్రం పవిత్రహోమం, నివేదన, శాత్తుమొర జరుగనున్నాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ మురళీధర్, సూపరింటెండెంట్ శ్రీ వెంకటేష్, కంకణభట్టార్ శ్రీ రాజేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.