PAVITROTSAVAM CONCLUDES AT SRI GT WITH PURNAHUTI _ పూర్ణాహుతితో ముగిసిన శ్రీ‌ గోవిందరాజస్వామివారి ప‌విత్రోత్స‌వాలు

పూర్ణాహుతితో ముగిసిన శ్రీ‌ గోవిందరాజస్వామివారి ప‌విత్రోత్స‌వాలు

తిరుప‌తి, 2020ఆగ‌స్టు 30: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆల‌యంలో ఆదివారం రాత్రి పూర్ణాహుతితో ప‌విత్రోత్స‌వాలు ముగిశాయి.

ఈ సందర్భంగా ఉదయం కల్యాణమండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, కొబ్బరినీళ్లు, తేనె, చందనంతో అభిషేకం నిర్వహించారు.

కాగా రాత్రి యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు, పూర్ణాహుతి, ప్ర‌బంధ శాత్తుమొర‌, వేద శాత్తుమొర నిర్వ‌హించారు. అనంత‌రం ఉత్స‌వ‌మూర్తులు కుంభం విమాన‌ప్ర‌ద‌క్షిణంగా స‌న్నిధికి వేంచేపు చేశారు.

ఈ కార్య్ర‌క‌మంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ్య‌ర్ స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న జీయ్య‌ర్ స్వామి, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, ఆల‌య ప్ర‌త్యేక శ్రేణి  డెప్యూటి ఈవో శ్రీ‌మ‌తి వ‌ర‌ల‌క్ష్మీ, సూపరింటెండెంట్లు శ్రీరాజ్‌కుమార్‌, శ్రీ శ‌ర్మ‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ కృష్ణ‌మూర్తి, శ్రీ మునేంద్ర‌బాబు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Tirupati, 30 Aug. 20: The three-day festival of Pavitrotsavam festival concludes at Sri Govindarajaswamy temple on Sunday with the Purnahuti ritual.

As part of the ritual the utsava idols of swami and His consorts were given a grand Snapana Tirumanjanam in the morning.

Later in the evening Vaidka programs of Purnahuti, Prabhanda Sattumora, Veda Sattumora held in the Yagashala and thereafter the utsava idols and the Kumbhakarna were brought to sanctum in a procession inside the temple.

Tirumala pontiffs Sri Sri Sri Pedda Jeeyar Swamy and Sri Sri Sri Chinna Jeeyar Swamy, Special Grade Dy EO Smt Varalakshmi and others were also present. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI