PAVITROTSAVAM ENDS AT VONTIMITTA IN SRI KRT _ ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు

Tirupati, 09 September 2021: The three-day Pavitrotsavam fete at Sri Kodandarama Swamy temple in Vontimitta at Sri YSR Kadapa district concluded on Thursday morning.

 

As part of last day festivities, the utsava idols of Sri Sita Lakshmana sameta Sri Rama were were brought to the yagashala in the morning for conducting several vaidika programs heralding the conclusion of the sacred event.

 

Later in the evening, the utsava idols were paraded in Ekantha inside the temple premises.

 

Temple AEO Sri Muralidhar, Superintendent Sri Venkatesh, Kankana Bhattar Sri Rajesh Swami were present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు

తిరుపతి, 2021 సెప్టెంబ‌రు 09: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు గురువారం ముగిశాయి. ఇందులో భాగంగా సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేశారు. ఉద‌యం బాల‌బోగం, చ‌తుష్టానార్చ‌న‌, మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జన, ఉద్వాసనలు, కుంబప్రోక్షణ, మహానివేదన చేప‌ట్టారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా ఉత్సవమూర్తుల ఊరేగింపు చేపడతారు..

ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ ముర‌ళీధ‌ర్‌, సూపరింటెండెంట్ శ్రీ వెంక‌టేష్‌, కంక‌ణ‌భ‌ట్టార్ శ్రీ రాజేష్ స్వామి త‌దిత‌రులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.