PAVITROTSAVAMS AT NARAYANAVANAM TTD TEMPLES _ ఆగస్టు 25, 26వ తేదీల్లో శ్రీ అగస్తీశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు
Tirupati, 23 Aug. 20: TTD will be organising annual Pavitrotsavam festival on August 25 and 26 at Sri Maragadavalli Sameta Agasthewara temple within Sri Venkateshwara temple complex at Narayanavanam with Ankurarpanam on August 24.
As part of the festival, Yagasala Puja, Purnahuti will be performed in the morning of August 25 and Pavitrotsavam rituals in the evening. On August 26 Purnahuti and Pavitramala Samarpana will be conducted.
Legends say that the temple was built by ancestors of Akasa Raja, father of Goddess Padmavati and the deity of Agastheeswara is a self-manifested one.
AT SRI PARASARESWARA TEMPLE
The holy Pavitrotsavam festival will also be performed at Sri Parasareswara Swamy Temple which is the sub-temple of Sri Kalyana Venkateswara temple in Narayanavanam on August 30 and 31 with Ankurarpanam on August 29.
As part of the festival, rituals like Pavitramalas and Raksha Bandhan is performed at yagasala on August 30.
Similarly, Maha Purnahuti, Yagasala Puja, Pavitra Samarpana will be done on August 31.
These pavitrotsavams would be conducted in Ekantham at both the temples in view of COVID-19 restrictions.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఆగస్టు 25, 26వ తేదీల్లో శ్రీ అగస్తీశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు
తిరుపతి, 2020 ఆగస్టు 23: టిటిడి పరిధిలోని నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ మరగదవల్లీ సమేత అగస్తీశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 25, 26వ తేదీల్లో పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకోసం ఆగస్టు 24వ తేదీ సాయంత్రం విఘ్నేశ్వర స్వామివారి పూజ, యాగశాల పూజ, అంకురార్పణ నిర్వహిస్తారు.
ఇందులోభాగంగా ఆగస్టు 25న ఉదయం యాగశాల పూజ, పూర్ణాహుతి, సాయంత్రం యాగశాలలో పవిత్రోత్సవాలకు పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదేవిధంగా ఆగస్టు 26న ఉదయం పూర్ణాహుతి, పట్టుపవిత్రాల సమర్పణ నిర్వహిస్తారు.
ఆలయ చరిత్రను పరిశీలిస్తే నారాయణవనం ప్రాంతాన్ని పరిపాలించిన శ్రీ పద్మావతీదేవి తండ్రి అయిన శ్రీ ఆకాశ మహారాజు పితామహులు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ శ్రీ అగస్తీశ్వరస్వామివారు స్వయంభువుగా వెలిశారు. స్వామివారి లింగాకారానికి పీఠభాగం అనగా పానవట్టాన్ని అమర్చి వేద ఆగమశాస్త్ర ప్రకారం శ్రీ అగస్త్య మహర్షులవారు ప్రతిష్ఠ చేసి పూజించినందువల్ల స్వామివారికి అగస్తీశ్వరస్వామి అని పేరు వచ్చింది.
శ్రీ పరాశరేశ్వరస్వామివారి ఆలయంలో …
నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ పరాశరేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 30, 31వ తేదీల్లో పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకోసం ఆగస్టు 29న సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తారు.
ఇందులోభాగంగా ఆగస్టు 30న యాగశాలలో పవిత్రమాలలకు పూజలు, రక్షాబంధనం నిర్వహిస్తారు. అదేవిధంగా ఆగస్టు 31న ఉదయం మహా పూర్ణాహుతి, యాగశాలపూజ, పట్టుపవిత్రాలను స్వామి, అమ్మవార్లు, పరివార దేవతలకు సమర్పిస్తారు.
కోవిడ్ – 19 నిబంధనల మేరకునారాయణవనంలోని శ్రీ మరగదవల్లీ సమేత అగస్తీశ్వరస్వామివారి ఆలయం, శ్రీ పరాశరేశ్వరస్వామివారి ఆలయాల్లో పవిత్రోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.