PAVITROTSAVAMS COMMENCE IN KRT_ శ్రీ కోదండరామాలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు ప్రారంభం

Tirupati, 7 August 2018: The annual Pavitrotsavams in Sri Kodanda Rama Swamy temple in Tirupati commenced on Tuesday.

Snapana Tirumanjanam was performed to deities between 9 am and 11 am go the processional deities.

While on the first day Pavitra Pratishta was performed in Yagashala.

Temple DyEO Smt Jhansi Rani, AEO Sri Tirumalaiah, Temple Supdt Sri Munikrishna Reddy, Temple Inspector Sri Sesha Reddy and devotees took part.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ కోదండరామాలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2018 ఆగస్టు 07: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు మంగళవారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలిసి కొన్ని, తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

మొదటిరోజు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం సీతారామ సమేత లక్ష్మణస్వామివారి ఉత్సవమూర్తులను విమాన ప్రదక్షిణగా యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ ఉదయం 11.00 నుండి 12.30 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరినీళ్లతో స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. అనంతరం శాత్తుమొర, ఆస్థానం నిర్వహించారు. సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు శ్రీసీతారామలక్ష్మణులు బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు అభయమివ్వనున్నారు. రాత్రి 7.00 నుండి 9.30 గంటల వరకు పవిత్ర ప్రతిష్ఠ, శయనాధివాసం నిర్వహిస్తారు.

ఈ పవిత్రోత్సవాన్ని ఆర్జిత సేవగా ప్రవేశపెట్టారు. రూ.500/- చెల్లించి ఇద్దరు గృహస్థులు పాల్గొనవచ్చు. ఈ సేవలో పాల్గొన్న గృహస్థులకు ఉత్తరీయం, రవికె, చివరి రోజు ఒక పవిత్రమాలను బహుమానంగా అందజేస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ తిరుమలయ్య, సూపరింటెండెంట్‌ శ్రీ మునికృష్ణారెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ శేషారెడ్డి, ఇతర అధికార ప్రముఖులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.