PAVITROTSAVAMS COMMENCES AT TIRUCHANOOR _ వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం

TIRUPATI, 18 SEPTEMBER 2021: The annual Pavitrotsvams commenced on a grand religious note at Sri Padmavathi Ammavari Temple in Tiruchanoor on Saturday.

After the morning rituals of Suprabhatam, Sahasranamarchana etc.Dwaratorana Dhwajakumbha Avahanam, Chakradi Mandalapuja, Chatustarchana, Agnipratistha, Pavitra Pratistha were perofrmed.

Later in the afternoon Snapana Tirumanjanam to Ammavaru was performed in Sri Krishna Mukha Mandapam.

Temple Deputy EO Smt Kasturi Bai, AEO Sri Prabhakar Reddy and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం

తిరుప‌తి, 2021 సెప్టెంబరు 18: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు శ‌నివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మొదటిరోజు శ్రీ పద్మావతి అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఆలయం నుండి యాగశాలకు వేంచేపు చేశారు. ఉద‌యం 8.30 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు ద్వారతోరణ ధ్వజకుంభ ఆవాహనం, చక్రాధి మండలపూజ, అగ్నిప్రతిష్ఠ, పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు.

మధ్యాహ్నం 2 నుండి 3.30 గంట‌ల వ‌ర‌కు శ్రీకృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, కొబ్బనీళ్లతో, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు జ‌రుగ‌నున్నాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి క‌స్తూరి బాయి, ఏఈవో శ్రీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, ఆల‌య అర్చ‌కులు శ్రీ బాబుస్వామి, సూపరింటెండెంట్‌ శ్రీ మధు, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ రాజేష్ పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.