PAVITROTSAVAMS COMMENCES IN CHANDRAGIRI RAMALAYAM _ చంద్రగిరిలోని శ్రీ కోదండరామాలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు ప్రారంభం

PAVITROTSAVAMS COMMENCES IN CHANDRAGIRI RAMALAYAM

Chandragiri 19  oct  19 ;The annual Pavitrotsavams commenced in Chandragiri Ramalayam on Saturday.

On the first day, Snapana Tirumanjanam was performed between 8.30am to 11.30am and then Chaturatarchana and Pavitra Pratista were organised. 

In the evening Pavitra Homalu were performed between 6pm and 8pm.

Temple DyEO Sri Subramanyam, Superintendent Sri Krishna Rao, Temple Inspector Sri Krishna Chaitanya and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

 చంద్రగిరిలోని శ్రీ కోదండరామాలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2019 అక్టోబరు 19 ;టిటిడి అనుబంధ ఆలయమైన చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు శ‌నివారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలిసి కొన్ని, తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
       
మొదటిరోజు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 8.30 నుండి 11.30 గంటల వరకు చతుష్టార్చన, పవిత్ర ప్రతిష్ట నిర్వహించారు.  అనంతరం సీతారామ సమేత లక్ష్మణస్వామివారి ఉత్సవమూర్తులను విమాన ప్రదక్షిణగా యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ ఉద‌యం 11.30 నుండి మ‌ధ్యాహ్నం 1.00 గంటల వరకు స్న‌పనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు పవిత్ర హోమాలు నిర్వహిస్తారు.
     

గృహస్తులు(ఇద్దరు) రూ.200/- చెల్లించి పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక పవిత్రమాల, తీర్థప్రసాదం బహుమానంగా అందజేస్తారు.
       
 ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, సూపరిండెంట్ శ్రీ కృష్ణారావు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కృష్ణ చైతన్య, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.