PAVITROTSAVAMS CONCLUDE AT APPALAYAGUNTA _ అప్ప‌లాయ‌గుంటలో ముగిసిన ప‌విత్రోత్స‌వాలు

Tirupati, October 8, 2026: The three-day Pavitrotsavams at Sri Prasanna Venkateswara Swamy Temple, Appalayagunta, concluded on Thursday with traditional rituals.

The day began with Suprabhatam, followed by Thomala Seva and Archana. Vedic rituals were performed at the Yagasala, and the Pavitrotsavams concluded with Purnahuti at 6.45 pm.

TTD JEO Dr. A. Sarat, Temple DyEO Sri Harindranath, AEO Sri Devarajulu, Superintendent Smt. Srivani, priests and temple staff, along with a large number of devotees, participated.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

అప్ప‌లాయ‌గుంటలో ముగిసిన ప‌విత్రోత్స‌వాలు

తిరుపతి, 2026 అక్టోబ‌రు 08: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు గురువారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, అర్చన చేప‌ట్టారు. ఆ త‌రువాత‌ యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 6 45 గంటలకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగిశాయి.

ఈ కార్యక్రమంలో టిటిడి జేఈవో డా ఎ శరత్, ఆల‌య డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీమ‌తి శ్రీవాణి, ఆలయ అర్చకులు శ్రీ సూర్య కుమార్ ఆచార్యులు, టెంపుల్ ఇన్స్‌పెక్టర్ శ్రీ వేణుగోపాల్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.