PAVITROTSAVAMS CONCLUDE IN SRI KT_ శ్రీ కపిలేశ్వరాలయంలో మహాపూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు

Tirupati, 7 July 2017: The annual three day pavitrotsavams concluded on a ceremonial note in Sri Kapileswara Swamy temple in Tirupati on Friday.

The day commenced with suprabhatam followed by a series of religious activities in Yagashala.

Pavitramalas were offered and purnahuti is performed marking the completion of the celestial fete.

Temple DyEO Sri Subramanyam and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI


శ్రీ కపిలేశ్వరాలయంలో మహాపూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు

తిరుపతి, 2017 జూలై 07: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు శుక్రవారం మహాపూర్ణాహుతితో వైభవంగా ముగిశాయి. ఉదయం మూలవర్లకు అభిషేకం, మహాపూర్ణాహుతి, పవిత్ర సమర్పణ నిర్వహించారు. అనంతరం స్వామివారికి ధూపదీపనైవేద్యాలు సమర్పించారు.

సాయంత్రం 6.30 గంటల నుండి 9.00 గంటల వరకు పంచమూర్తులైన శ్రీసోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, వళ్లి దేవసేన సమేత శ్రీసుబ్రమణ్యస్వామి, శ్రీ చండికేశ్వరస్వామివారి వీధి ఉత్సవం ఘనంగా జరుగనుంది. పవిత్రోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు పవిత్రమాల, తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో తితిదే స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ శంకర్‌రాజు, ఆలయ అర్చకులు శ్రీ స్వామినాథన్‌ స్వామి, శ్రీ మణిస్వామి, శ్రీ ఉదయస్వామి, సూపరింటెండెంట్‌ శ్రీ ఓబుల్‌రెడ్డి, టెంపుల్‌ ఇన్స్‌పెక్టర్లు శ్రీ నారాయణ, శ్రీమురళీక ష్ణ ఇతర అధికారులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.