PAVITROTSAVAMS CONCLUDED _ శ్రీవారి ఆలయంలో పూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు
TIRUMALA, 10 AUGUST 2022: The annual Pavitrotsavams concluded with Purnahuti on Wednesday evening.
In the morning Snapana Tirumanjanam, evening Tiruveedhi utsavam were observed while from 7pm onwards Yagashala festivities, were performed and culminated with Pavitra Purnahiti.
HH Tirumala Pedda Jeeyar Swamy, HH Tirumala Chinna Jeeyar Swamy, TTD EO Sri AV Dharma Reddy, Temple DyEO Sri Ramesh Babu and others were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి ఆలయంలో పూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు
తిరుమల, 2022 ఆగస్టు 10: తిరుమల శ్రీవారి ఆలయంలో మూడురోజులపాటు జరిగిన పవిత్రోత్సవాలు బుధవారం రాత్రి పూర్ణాహుతితో ముగిశాయి.
ఇందులో భాగంగా బుధవారం ఉదయం 7 నుండి 9 గంటల వరకు యాగశాలలో ఋత్వికులు హోమాలు నిర్వహించారు. ఆ తరువాత ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం చేపట్టారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపుతో అభిషేకించి చివరగా చందనం పూత పూశారు. ధూపదీప హారతులు నివేదించారు.
సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు కటాక్షించారు. రాత్రి 7 నుండి యాగశాలలో పూర్ణాహుతి నిర్వహించారు. ఆ తరువాత శ్రీ మలయ్పప్పస్వామివారు శ్రీదేవి, భూదేవితో కూడి విమాన ప్రదక్షిణంగా వెళ్లి ఆలయ ప్రవేశం చేయడంతో పవిత్రోత్సవాలు ముగిశాయి.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రమేష్ బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.