PAVITROTSAVAMS CONCLUDES _ ఘనంగా ముగిసిన శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు
TIRUPATI, 26 JULY 2022: The annual Pavitrotsavams concluded on a grand religious note in Sri Kodanda Ramalayam in Tirupati on Tuesday with Pavitra Purnahuti.
Temple DyEO Smt Nagaratna, AEO Sri Durgaraju, Archaka Sri Ananda Kumar Deekshitulu and others, devotees were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUMALA
ఘనంగా ముగిసిన శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు
తిరుపతి, 2022 జూలై 26: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు మంగళవారం సాయంత్రం పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి.
ముందుగా స్వామివారిని ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 9.00 నుంచి 11.00 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరిగాయి. ఉదయం 11.00 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం వైభవంగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.
సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు తిరువీధి ఉత్సవం, భాష్యకార్ల గుడి వద్ద యిహల్ శాత్తుమొర నిర్వహించారు. అనంతరం ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, ఉత్సవమూర్తులను, ప్రధాన కుంభాన్ని విమాన ప్రదక్షిణంగా సన్నిధికి చేర్చడం, కుంభా ఆవాహన తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ దుర్గరాజు, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఆనందకుమార్ దీక్షితులు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.