PAVITROTSAVAMS CONCLUDES IN SRI TT _ శ్రీ‌వారి ఆల‌యంలో పూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు

TIRUMALA, 20 AUGUST 2021: The annual three-day Pavitrotsavams concluded on a religious note in Tirumala temple on Friday.

 

After Snapana Tirumanjanam to the Utsava Murthies in the morning, the deities were paraded along the four Mada streets in the evening.

 

In the night between 6 pm and 9pm, Purnahuti will be performed in Yagashala which marks the ceremonious conclusion of this annual festival.

 

HH Sri Pedda Jeeyar Swamy, HH Sri Chinna Jeeyar Swamy of Tirumala, TTD EO Dr KS Jawahar Reddy, Additional EO Sri AV Dharma Reddy, Temple DyEO Sri Ramesh Babu and others were present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ‌వారి ఆల‌యంలో పూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు

తిరుమల, 2021 ఆగస్టు 20: తిరుమల శ్రీవారి ఆలయంలో మూడురోజులపాటు జరిగిన పవిత్రోత్సవాలు శుక్ర‌వారం సాయంత్రం పూర్ణాహుతితో ముగిశాయి.

ఇందులో భాగంగా శుక్ర‌వారం ఉదయం 8.00 నుండి 9.00 గంట‌ల వ‌ర‌కు యాగశాలలో ఋత్వికులు హోమాలు నిర్వహించారు. ఆ తరువాత ఉదయం 9.00 నుండి 11.00 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం చేపట్టారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపుతో అభిషేకించి చివరగా చందనం పూత పూశారు. ధూపదీప హారతులు నివేదించారు.

కాగా, సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భ‌క్తుల‌కు క‌టాక్షించ‌నున్నారు. సాయంత్రం 6.00 నుండి రాత్రి 9.00 గంటల వరకు యాగశాలలో పూర్ణాహుతి నిర్వహించ‌నున్నారు. ఆ తరువాత శ్రీ మలయ్పప్పస్వామివారు శ్రీదేవి, భూదేవితో కూడి విమాన ప్రదక్షిణంగా వెళ్లి ఆలయ ప్రవేశం చేయడంతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి.

ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, అద‌న‌పు ఈవో శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్ బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.