PAVITROTSAVAMS CONCLUDES WITH PURNAHUTI _ శ్రీ కపిలేశ్వరాలయంలో మహాపూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు

TIRUPATI, 12 JULY 2022: The annual Pavitrotsavams concluded with Purnahuti in Kapileswara Swamy temple on Tuesday evening.

After the Pavitra Malas were offered Dhoopa Deepa Naivedyams were rendered in the morning. Later Maha Purnahuti was performed marking the grand conclusion of the religious event.

Temple DyEO Sri Devendrababu, AEO Sri Srinivasulu, Superintendent Sri Bhupati and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయంలో మహాపూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు

తిరుపతి, 2022 జూలై 12: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు మంగ‌ళ‌వారం మహాపూర్ణాహుతితో వైభవంగా ముగిశాయి. ఉదయం మూలవర్లకు అభిషేకం, మహాపూర్ణాహుతి, పవిత్ర సమర్పణ నిర్వహించారు. అనంతరం స్వామివారికి ధూపదీపనైవేద్యాలు సమర్పించారు.

సాయంత్రం 6.30 గంటల నుండి పంచమూర్తులైన శ్రీసోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, వళ్లి దేవసేన సమేత శ్రీసుబ్రమణ్యస్వామి, శ్రీ చండికేశ్వరస్వామివారి వీధి ఉత్సవం చేపట్టారు . పవిత్రోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు పవిత్రమాల, తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర‌బాబు, ఏఈవో శ్రీ శ్రీ‌నివాసులు, సూప‌రింటెండెంట్ శ్రీ భూప‌తి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ రెడ్డిశేఖ‌ర్‌, శ్రీ శ్రీనివాస నాయక్ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.