PEARL ARMOUR TO GOVINDA RAJA SWAMY_ శ్రీ గోవిందరాజస్వామివారికి ముత్యపుకవచం బహూకరణ

Tirupati, 11 Jan. 19: An ardent devotee of Bhagavad Sri Ramanujacharya has donated Rs.11lakhs worth pearl armour to be adorned to the presiding deity of Sri Govinda Raja Swamy on Friday.

HH Sri Pedda Jiyangar Swamy of Tirumala offered this precious donation on the request of the anonymous devotee. Meanwhile it may be mentioned here that in 2016, pearl armour was offered to utsava murthy of Lord.

TTD EO Sri Anil Kumar Singhal, Tirumala JEO Sri KS Sreenivasa Raju were also present.

Earlier the EO also had inspected the development works in the temple.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామివారికి ముత్యపుకవచం బహూకరణ

జనవరి 11, తిరుపతి 2019: టిటిడి శ్రీశ్రీశ్రీ శఠగోపరామానుజ పెద్దజీయర్‌స్వామివారు శుక్రవారం సాయంత్రం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి మూలమూర్తికి అలంకరించేందుకు ముత్యపుకవచాన్ని బహూకరించారు. ఈ కవచం విలువ రూ.11 లక్షలని ఆలయ అధికారులు తెలిపారు.

శ్రీ పెద్దజీయర్‌ మఠంలో ముందుగా శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి ఈ ముత్యపు కవచానికి పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో, జెఈవోలను మఠం తరఫున శాలువతో ఘనంగా సన్మానించారు. అనంతరం శ్రీ పెద్దజీయర్‌ మఠం నుండి ముత్యపు కవచాన్ని ఆలయానికి తీసుకెళ్లి స్వామివారి మూలవర్లకు అలంకరించారు. భగవద్‌ రామానుజాచార్యులవారి ఒక అజ్ఞాతభక్తుడు ఈ ముత్యపుకవచాన్ని తయారు చేయించిన ఆలయ అధికారులు తెలిపారు. గతంలో 2016వ సంవత్సరంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామివారు శ్రీగోవిందరాజ స్వామి ఉత్సవర్లకు ముత్యపుకవచం సమర్పించారు.

ఆ తరువాత శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జరుగుతున్న జనరేటర్‌ గది, వాటర్‌ సంప్‌ నిర్మాణపనులు, బుగ్గ అభివృద్ధి పనులను, లగేజి కౌంటర్‌ను ఈవో పరిశీలించారు. ఆలయంతోపాటు ఊంజల్‌ మండపం, యాగశాల, అద్దాలమండపాల్లోని శిల్పకళను భక్తులు వీక్షించేలా చేసిన ఏర్పాట్లను, తిరుమలనంబి ఆలయంలో జరుగుతున్న జీర్ణోద్ధరణ పనులను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఎఫ్‌ఏసిఏవో శ్రీ ఓ.బాలాజి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, డిఎఫ్‌వో శ్రీ ఫణికుమార్‌నాయుడు, విజివో శ్రీఅశోక్‌కుమార్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.