PEDDA SESHA VAHANA SEVA HELD _ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలు ప్రారంభం
TIRUPATI, 03 JULY 2022: In connection with the annual Sakshatkara Vaibhavotsavams in Srinivasa Mangapuram, Pedda Sesha Vahana Seva was held in the evening.
Earlier in the morning, Snapana Tirumanjanam was held to the utsava deities of Sri Kalyana Venkateswara and Sridevi, Bhudevi.
To mark the auspicious day of the revival of Nitya pooja kainkaryams as believed to have decided by the Lord Himself, TTD has been observing this festival on the auspicious Ashada Suddha Sasti Day in the month of June/July of every year.
Temple Special Gr DyEO Smt Varalakshmi, Archaka Sri Balaji Rangacharyulu, Superintendents Sri Chengalrayalu, Sri Ramanaiah and others were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలు ప్రారంభం
తిరుపతి, 2022 జులై 03: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవం మూడు రోజుల పాటు జరుగనుంది.
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉదయం 10 నుండి 11 గంటల వరకు ఆలయ ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు ఊంజల్ సేవ జరిగింది. రాత్రి 8 నుండి 9 గంటల వరకు పెద్దశేష వాహనంపై స్వామి, అమ్మవార్లు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.
పెద్దశేష వాహనం
ఏడుపడగలు గల ఆదిశేషుడు ఏడుకొండలకు, ఏడులోకాలకు సంకేతం. శేషుడు శ్రీనివాసునికి తిరుమలలో నివాసభూమి అయినా శ్రీనివాసమంగాపురంలో
వాహనరూపంలో శ్రీవారిని స్తుతిస్తూ, స్వామికి మంచం, పరుపు, ఛత్రం మూడూ తానే అయి శేషశాయి అనే పేరును సార్థకం చేస్తున్నాడు. శ్రీవారికి విశ్రాంతికి, సుఖనిద్రకూ కారణమవుతున్నాడు. తనను, శేషుణ్ణీ దర్శించే భక్తుల్ని కాపాడుతానని, మీరందరూ శేషుని వలే తనకు నిత్య సేవకులుగా ఉండి సత్ఫలాలు పొందాలని ఈ వాహనసేవ ద్వారా స్వామివారు అనుగ్రహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ బాలాజి రంగాచార్యులు, సూపరింటెండెంట్లు శ్రీ చెంగల్రాయలు, శ్రీ రమణయ్య ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.