PEDDASESHA VAHANA SEVA ON NOVEMBER 13 _ నవంబర్ 13న పెద్ద శేష వాహనంపై మలయప్ప స్వామి దర్శనం
Tirumala, 10 November 2026: On the auspicious occasion of Nagula Chavithi on November 13, the processional deities of Sri Malayappa Swamy along with His consorts, will bless devotees on the Pedda Sesha Vahanam from 7 PM to 9 PM in Tirumala.
The procession on the Sesha Vahanam symbolizes the essence of Saranagati as the Serpent King Adisesha has served his Master in many ways of being his bed, ornament, umbrella(shade) and many more offering his loyal services.
Even among the various Brahmotsava Vahana Sevas in Tirumala, Pedda Sesha Vahanam holds the highest significance of being the first divine carrier during the nine day mega religious festival.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
నవంబర్ 13న పెద్ద శేష వాహనంపై మలయప్ప స్వామి దర్శనం
తిరుమల, 2026 నవంబర్ 10: తిరుమలలో నవంబర్ 13వ తేదీన నాగుల చవితి పర్వదినం సందర్భంగా పెద్దశేష వాహనంపై రాత్రి 7 నుండి 9 గంటలవరకు శ్రీ మలయప్పస్వామివారు ఉభయ దేవేరులతో కలిసి దర్శనమివ్వనున్నారు. సర్పరాజైన ఆదిశేషువు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా స్వామివారికి విశేష సేవలందించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
శ్రీ వేంకటేశ్వరస్వామి సహస్రనామాలతో శేషసాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయం అంటూ నిత్య పూజలు అందుకుంటున్నారు. అటు రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరామునిగా స్వామివారికి అత్యంత సన్నిహితునిగా వ్యవహరించే ఆదిశేషువు శ్రీ వైకుంఠంలోని నిత్యసూరులలో ఆద్యుడు.
ఈ విధంగా స్వామివారు, దాసభక్తికి మారురూపంగా నిలిచే తన ప్రియ భక్తుడైన శ్రీ ఆదిశేషుడిపై ఉభయదేవేరులతో కూడి తిరువీధులలో విహరిస్తూ భక్తులకు అభయమివ్వడమే కాకుండా శరణాగతి ప్రపత్తిని కూడా సాక్షాత్కరింపచేస్తాడు.
శ్రీవారి బ్రహ్మోత్సవ వాహన సేవలలో కూడా తొలి ప్రాధాన్యత ఆదిశేషునిదే.

