PEDDASESHA VAHANAM THIRLLS DEVOTEES_ పెద్దశేష వాహనంపై శ్రీ మలయప్ప కనువిందు

Tirumala, 10 Oct. 18: The nine day devotional ecstasy at the Hill Town of Tirumala was marked by the procession of Pedda Sesha Vahanam on the sacred Mada Streets enthralling the devotees with the grand spectacle of Sri Malayappa Swamy taking a majestic ride on the seven hood Serpent King Adishesha on Wednesday evening.

On the first day evening of the Navaratri Brahmotsavams, the processional deities of Sri Malayappa swamy flanked on either sides by His two divine consorts, Sridevi and Bhudevi mounted atop the golden Pedda Sesha Vahanam, was taken around the mada streets of the hill temple in a grand procession The sesha vahanam is symbolic with Dhyana Bhakti.

SIGNIFICANCE

Aadisesha is the seat on which Lord Srimannarayana rests in his abode Sri Vaikunta. In Tirumala hills the Seshachala range is believed to be the manifestation of Divine serpent, Aadisesha. That is why it is also called Seshachala.

From a distance, Tirumala hills appears in serpentine form. Legends say that In Tretha Yuga, during Sri Ramaavathara, Aadi Sesha took the incarnation of Lakshmana Swamy, while in Dwapara Yuga during Sri Krishnaavathara he took the form of Balarama.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

పెద్దశేష వాహనంపై శ్రీ మలయప్ప కనువిందు :

అక్టోబ‌రు 10, తిరుమల 2018: శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణశేషవాహనంపై(పెద్ద శేషవాహనం) తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహించారు. ఆదిశేషుడు తన పడగ నీడలో స్వామివారిని సేవిస్తూ పాన్పుగా దాస్యభక్తిని చాటుతున్నాడు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. ఈయన శ్రీభూదేవి సహితుడైన శ్రీవేంకటేశ్వరుని వహిస్తూ తొలిరోజు భక్తులకు దర్శనమిచ్చారు. గురువారం ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనాలపై స్వామివారు కనువిందు చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, ఇన్‌చార్జి సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, విఎస్‌వో శ్రీ రవీంద్రారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీహరీంద్రనాథ్‌, పేష్కార్లు శ్రీ రమేష్‌బాబు, శ్రీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.