పెద్ద శేషవాహనంపై ఊరేగిన శ్రీ గోవిందరాజస్వామివారు
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
పెద్ద శేషవాహనంపై ఊరేగిన శ్రీ గోవిందరాజస్వామివారు
ఏప్రిల్ 12, తిరుపతి, 2018: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి వారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమంలో భాగంగా గురువారం సాయంత్రం 5.30 నుండి 7.00 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీగోవిందరాజస్వామివారు పెద్ద శేషవాహనంపై, భాష్యకార్లు, ఆళ్వార్లు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధులలో భక్తులకు దర్శనం ఇచ్చారు.
కాగా, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు శ్రీ భాష్యకార్లు వారికి పెద్ద వీధి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీ చిన్న జీయర్ స్వామి, స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ, ఎవిఎస్వో శ్రీ పార్థసారథి రెడ్డి, సూపరెంటెండెంట్ శ్రీ సురేష్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.