PERFORM DUTIES WITH DEVOTION AND DEDICATION – TTD ADDITIONAL EO _ భక్తి, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలి
Tirumala, 11 September 2026: The TTD Additional Executive Officer Sri Ch. Venkaiah Chowdary called upon the deputation officers and staff deployed for the annual Srivari Brahmotsavams, to discharge their duties with devotion and dedication and make the festival a grand success.
An orientation programme was conducted for the deputation staff at the Asthana Mandapam in Tirumala on Friday evening.
Speaking on the occasion, the Additional EO said that every employee should have a clear understanding of the arrangements and responsibilities involved in conducting the twin Brahmotsavams this year as a large number of devotees are expected to visit Tirumala.
He directed officials and staff of all departments to work in close coordination, drawing on their past experience.
He instructed the staff to immediately bring any issues relating to the facilities being provided to devotees to the notice of senior officials and ensure their prompt resolution.
He urged them to treat devotees courteously and serve them with a spirit of dedication, thereby enhancing the reputation of the institution during Srivari Brahmotsavams.
TTD CVSO Sri Muralikrishna advised the staff to coordinate with the district administration and Police while performing their duties during the Brahmotsavams.
He called for collective efforts to make the Srivari Brahmotsavams a landmark event in history.
TTD In-charge CE Sri Manoharam, SE Sri Venugopal, Deputy EOs Sri Bhaskar, Sri Rajendra Kumar, Sri Somannarayana, Catering Special Officer Sri Sastry, VGO Sri Surendra and other officials participated in the programme.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
భక్తి, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలి
బ్రహ్మోత్సవ డెప్యూటేషన్ సిబ్బందికి టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి సూచన
తిరుమల, 2026 సెప్టెంబరు 11: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా విధులు నిర్వర్తించేందుకు వచ్చిన డిప్యూటేషన్ అధికారులు, సిబ్బంది భక్తి, నిబద్ధతతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి పిలుపునిచ్చారు.
తిరుమల ఆస్థాన మండపంలో శుక్రవారం సాయంత్రం బ్రహ్మోత్సవాల విధుల కోసం వచ్చిన డిప్యూటేషన్ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణపై ఉద్యోగులందరికీ పూర్తి అవగాహన ఉండాలని అన్నారు. ఈసారి రెండు బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉన్నందున, గత అనుభవాన్ని ఉపయోగించుకుని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ప్రతి ఉద్యోగి తనకు కేటాయించిన విధులు, బాధ్యతలపై పూర్తి అవగాహన కలిగి క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని తెలిపారు. విధుల్లో ఉన్న సిబ్బంది అందరూ నిర్దేశించిన దుస్తులు ధరించాలని సూచించారు.
భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాల్లో ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సీనియర్ అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అదనపు ఈవో సూచించారు. భక్తుల పట్ల మర్యాదగా, సేవాభావంతో వ్యవహరించి శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రతిష్టను మరింత ఇనుమడింపజేయాలని కోరారు.
సమన్వయంతో పనిచేయాలి : సీవీఎస్వో
టీటీడీ సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన బాధ్యతలను క్రమశిక్షణతో, సమర్థవంతంగా నిర్వర్తించాలని అన్నారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలు చరిత్రలో మైలురాయిగా నిలిచేలా అధికారులు, సిబ్బంది సమష్టి కృషి చేయాలని ఆయన కోరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో విధులు నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఇన్‌చార్జ్ సీఈ శ్రీ మనోహరం, ఎస్ఈ శ్రీ వేణుగోపాల్, డిప్యూటీ ఈవోలు శ్రీ భాస్కర్, శ్రీ రాజేంద్ర, శ్రీ సోమన్నారాయణ, క్యాంటరింగ్ ప్రత్యేక అధికారి శ్రీ శాస్త్రి, వీజీఓ శ్రీ సురేంద్ర తదితర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.






