PHILOSOPHY OF INDIA LIES IN VEDA DHARMA-GOVARDHANA PEETHAM SEER _ వేద ధర్మంలో భారతీయ తత్వం : గోవర్ధన పీఠాధిపతి

Tirumala, 20 Nov. 19: The entire philosophy of Bharat lies in Veda Dharma, asserted, the chief pontiff of Sri Govardhana Peetham of Orissa,    H H Sri Nischalananda Saraswathi Swamy.

During his religious discourse organized under the aegis of SV Higher Vedic Studies of TTD at Asthana Mandapam in Tirumala on Wednesday evening, he said the propagation, promotion and preservation of Veda Dharma is much needed for the country at this juncture for the benefit of entire humanity.

He said, this divine task could be taken forward across the country only by the world’s renowned and biggest Hindu temple management of Tirumala Tirupati Devasthanam. 

The Junior Pontiff of the mutt Sri Niroopananda Saraswathi Swamiji, DyEO R 1 Sri Balaji,  SVHVS Project Officer Dr A Vibhishana Sharma,  students of Dharmagiri Veda Parhashala and others were also present. 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI 

 

 

వేద ధర్మంలో భారతీయ తత్వం : గోవర్ధన పీఠాధిపతి
 
తిరుమల, 2019 నవంబరు 20: భారతీయ తత్వశాస్త్రం అంతా వేద ధర్మం లో ఉందని ఒడిశాలోని గోవర్ధన పీఠం  ప్రధాన పీఠాధిపతి శ్రీ నిశ్చలానంద సరస్వతి స్వామి ఉద్ఘాటించారు.
 
ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం తిరుమలలోని ఆస్థాన మండపంలో ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ అనుగ్రహ భాషణం చేస్తూ మానవాళి ప్రశాంత జీవనం కోసం వేద ధర్మాన్ని పరిరక్షించి,  ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇంతటి బృహత్తర బాధ్యతను ప్రపంచ ప్రఖ్యాత ధార్మిక క్షేత్రమైన టిటిడి నిర్వహించడం ముదావహం అన్నారు.
 
ఈ కార్యక్రమంలో పీఠం స్వామీజీ శ్రీ నిరుపమానంద సరస్వతి, డెప్యూటీ ఈవో శ్రీ బాలాజీ, ఎస్ వి ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు ఆఫీసర్ డా. ఆకెళ్ళ విభీషణ శర్మ, ధర్మగిరి వేద పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.