AGED, PHC AND PARENTS WITH INFANTS GETS SATISFACTORY DARSHAN _ వృద్ధులు, దివ్యాంగులకు సంతృప్తికరంగా శ్రీవారి దర్శనం రోజుకు 2 స్లాట్లలో 1400 మందికి టోకెన్లు
Tirumala, 7 April, 2018: With an aim to provide darshan to more number of aged, physically challenged and parents with infants below five years of age, TTD has been allotting darshan to more number of pilgrims falling under this category of pilgrims on any two lean pilgrim days in a month.
For the aged persons (who are 65 and above) and physically challenged TTD has set up seven token issuing counters in front of SV Museum. Usually every day 1400 tickets will be issued in two darshan slots with first one at 10am and second at 3pm. But on Fridays and during Koil Alwar Tirumanjanam (four Tuesdays in a year) the morning slot darshan is cancelled. Darshan tokens will be issued to the pilgrims by taking their Aadhaar / Voter Cards with 90 days limit for next turn of their darshan. They will be issued two laddus on a subsidy of Rs.20 and four laddus on payment of Rs.70.
AMENITIES TO AGED AND PHC
TTD has made comfortable arrangements for this category of pilgrims in the three waiting halls with over 1000 seating capacity. There are well constructed toilets in these halls. There is a transportation facility from the counters to these halls by means of two battery vehicles and an exclusive van. In the morning breakfast and milk are served while in the afternoon slot annaprasadams are served to the pilgrims. A LED TV is also arranged for the sake of the pilgrims and devotional programmes of SVBC are telecasted.
In April, 4000 tickets in three darshan slots will be issued to the aged and physically challenged persons on April 10 and 24. In 10am slot 1000 tokens, 2pm slot 2000 tokens and 3pm slot 1000 tokens will be issued on these two days. While the parents with children below five years of age will be allowed for darshan through Supadham from 9am till 1:30pm on April 11 and 25.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
వృద్ధులు, దివ్యాంగులకు సంతృప్తికరంగా శ్రీవారి దర్శనం రోజుకు 2 స్లాట్లలో 1400 మందికి టోకెన్లు
నెలకు రెండు సార్లు 4 వేల మందికి అనుమతి
వేచి ఉండే హాళ్లలో పాలు, అన్నప్రసాద వితరణ
ఏప్రిల్ 07, తిరుమల 2018: వయసు పైబడిన(65 సం||ల పైన)వారికి, శారీరక, మానసిక వైకల్య సమస్యలున్నవారికి టిటిడి సకల సౌకర్యాలు ఏర్పాటుచేసి సంతృప్తికరంగా శ్రీవారి దర్శనం కల్పిస్తోంది. వేచి ఉండే హాళ్లలో నిరంతరాయంగా పాలు, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. సాధారణ రోజుల్లో 2 స్లాట్లలో 1400 మందిని, రద్దీ తక్కువగా ఉన్న సమయాల్లో నెలకు రెండు రోజుల్లో 4 వేల మందికి చొప్పున వృద్ధులు, దివ్యాంగులకు స్వామివారి దర్శనభాగ్యాన్ని టిటిడి కల్పిస్తోంది.
తిరుమలలోని ఎస్వీ మ్యూజియం ఎదురుగా వృద్ధులు, దివ్యాంగులకు టోకెన్లు ఇచ్చేందుకు 7 కౌంటర్లను టిటిడి ఏర్పాటుచేసింది. ఇక్కడ ఉదయం 10 గంటల స్లాట్‌కు 700 మందికి, మధ్యాహ్నం 3 గంటల స్లాట్‌కు 700 మందికి టోకెన్లు జారీ చేస్తారు. ఉదయం 7 గంటల నుండి టోకెన్ల జారీ మొదలవుతుంది. రెండు స్లాట్లకు కలిపి ఉదయం నుండే టోకెన్లు మంజూరుచేస్తారు. శుక్రవారం, కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం రోజుల్లో మాత్రం ఉదయం 10 గంటల స్లాట్ ఉండదు. మధ్యాహ్నం 3 గంటల స్లాట్‌లో 700 మందిని మాత్రమే అనుమతిస్తారు. ఇక్కడ వ్యక్తిగతంగా ఫొటో తీసుకోవడంతోపాటు ఆధార్ నంబరును నమోదు చేసుకుంటారు. రాయితీపై రూ.20/-కి రెండు లడ్డూలు, రూ.70/-కి నాలుగు లడ్డూలు కొనుగోలు చేయవచ్చు. ఈ కౌంటర్ల వద్ద వృద్ధులు, దివ్యాంగులు కూర్చునేందుకు బెంచీలు ఏర్పాటుచేశారు. ఇక్కడినుండి 2 బ్యాటరీ వాహనాలు, ఒక వ్యాన్ ద్వారా వృద్ధులు, దివ్యాంగులను దక్షిణ మాడ వీధి వద్దగల వేచి ఉండే హాళ్లకు తరలిస్తారు.
మొత్తం 3 వేచి ఉండే హాళ్లు ఉన్నాయి. ఇక్కడ వెయ్యి మందికిపైగా కూర్చునేందుకు కుర్చీలను ఏర్పాటుచేశారు. మరుగుదొడ్ల వసతి ఉంది. ఉదయం పాలు, అల్పాహారం, మధ్యాహ్నం అన్నప్రసాదాలను పంపిణీ చేస్తారు. ఈ హాళ్లలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను తిలకించేందుకు టివిని ఏర్పాటుచేశారు. సెల్‌ఫోన్లు, లగేజిని ఇక్కడే డిపాజిట్ చేసే సౌకర్యం ఉంది. దర్శనం తరువాత తిరిగి ఇక్కడే వీటిని పొందొచ్చు. వేచి ఉండే హాళ్ల నుండి ప్రత్యేక క్యూలైన్ ద్వారా దర్శనానికి పంపుతారు. నడవలేనివారికి శ్రీవారి సేవకులను సహాయకులుగా పంపుతారు.
నెలకు రెండు సార్లు 4 వేల మందికి అనుమతి :
రద్దీ తక్కువగా ఉన్న రోజుల్లో నెలకు రెండు సార్లు వయోవృద్ధులకు, దివ్యాంగులకు కలిపి 4 వేల టోకెన్లను టిటిడి జారీ చేస్తోంది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా వృద్ధులు, దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది. ఏప్రిల్ 10, 24వ తేదీల్లో వృద్ధులు, దివ్యాంగులకు రోజకు 4 వేల టోకెన్లు జారీ చేస్తారు.
5 సంవత్సరాలలోపు చంటి పిల్లలను, వారి తల్లిదండ్రులను ఏప్రిల్ 11, 25వ తేదీల్లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు సుపథం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సాధారణ రోజుల్లో ఒక సంవత్సరంలోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా ప్రవేశం కల్పిస్తారు. భక్తుల కోరిక మేరకు ఐదేళ్లలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను ఈ రెండు రోజుల్లో సుపథం మార్గం ద్వారా అనుమతిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.