PILGRIMS POUR IN LAURELS ON TTD FOR BTU ARRANGEMENTS_ డయల్‌ యువర్‌ ఈవో ముఖ్యాంశాలు

Tirumala, 6 October 2017: The pilgrims across the country who thronged Tirumala during the annual Brahmotsavams of Lord Venkateswara during last week complimented TTD EO Sri Anil Kumar Singhal and his team of officials and employees for making elaborates arrangements for the mega religious fete.

The laurels poured on TTD by the devotees during the monthly “Dial your EO” program held at Annamaiah Bhavan in Tirumala on Friday. While the TTD EO was taking the calls from the pilgrims in this hour long program, Sri Srinivasa Rao from Visakhapatnam, Sri Deepak from Karnataka, Sri Gnanaprakash from Tirupati, Sri Umashanker from Hyderabad lauded the efforts of TTD towards an incident free Brahmotsavams in spite of heavy turnout of pilgrims crowd especially during Garuda Seva.

Responding to their compliments the TTD EO said, it was possible with the team work of all officials and employees, co-ordination between vigilance and police and above all the co-operation from pilgrims.

Later answering pilgrim callers, Sri Kirankumar from Tirupati, Sri Bhaskar from Visakhapatnam, Sri Prabhakar from Nandigama, the EO said, the new system of electronic dip for premiere arjitha Seva tickets is well designed in a transparent manner. “The pilgrims can book these tickets for a week. This has enabled even the pilgrims who do not have proper internet band width in their home turfs. After a week the electronic dip will be taken and allotment is being made”, he added.

When a pilgrim caller from Chennai Sri Diwakar sought EO to consider the request private banks like ICICI, Karur Vysya, ING Vysya banks also to register for Parakamani Seva, the EO assured he will negotiate with the officials concerned and necessary amendments will be brought soon.

A pilgrim caller Sri Srinivasa Rao from Tenali sought TTD EO to give a chance to upcoming students who have expertise in Annamaiah Sankeertans and give them an opportunity to perform on Nada Neerajanam platform during morning slots. Welcoming the suggestion, the EO said they will look into it.

Another caller Sri Srinivasa Rao from Vizag sought EO to allot a quota of rooms in on-line during festive occasions like Brahmotsavams, for which the EO replied, TTD has not completely cancelled the online accommodation but has reduced the quota during the peak season.

Replying a pilgrim caller Sri Nageswar from Nagpur, the EO said, TTD has brought wide changes in the recent times to provide hassle free darshan to devotees inside sanctum. “However we will give instructions to our employees, volunteers, scouts, security personnel in proper pilgrim crowd management.

A caller Sri Srinivasa Naidu from Kurnool brought to the notice of EO about the hiked rates charged by shopkeepers in Tirumala and suggested TTD to fix the rates on eatables and also on the fares of buses plying between Tirupati and Tirumala. The EO responded to him that squads will be sent at regular intervals to shops.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

డయల్‌ యువర్‌ ఈవో ముఖ్యాంశాలు_

తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.

1. ఆనందకుమార్‌ – విశాఖపట్నం

ప్రశ్న: లడ్డూ ప్రసాదసేవకులకు గతంలో ఉన్న సౌకర్యాలను పునరుద్దరించండి ?

ఈ.వో. లడ్డూ ప్రసాదసేవకుల నుంచి అభిప్రాయాలను సేకరించి తగు నిర్ణయం తీసుకుంటాం.

2. కిరణ్‌కుమార్‌ – తిరుపతి

ప్రశ్న: లక్కీడిప్‌లో సుప్రభాత సేవ టికెట్‌ మంజూరైంది. ఆధార్‌ నెంబర్‌ తప్పుగా ఉండటం వల్ల పెండింగ్‌లో పెట్టారు ?

ఈ.వో. కొంత మంది సరైన వివరాలు పొందుపర్చకపోవడంతో ఆపడం జరిగింది. సరైన సమాచారం ఇస్తే తిరిగి మంజూరు చేస్తాం.

3. భాస్కర్‌రావు – విజయవాడ

ప్రశ్న: బ్రహ్మూెత్సవాలలో లడ్డూ ప్రసాదసేవకు వచ్చాం. సాయంత్రం 6 గంటల తర్వాత ఐటి సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో విధులకు అంతరాయం కలిగింది. ?

ఈ.వో. ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం.

4. శ్రీనివాసరావు – తెనాలి

ప్రశ్న: నాదనీరాజనం వేదికపై ఉదయం వేళ గ్రేడ్‌ లేని కళాకారులకు ప్రదర్శనలకు అవకాశం ఇవ్వండి. అన్నమయ్య సంకీర్తన బృందాలను టిటిడి అన్నమాచార్య ప్రాజెక్ట్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోండి. సహస్త్రదీపాలంకార సేవ సమయంలో వర్షంతో ఇబ్బందుల్లేకుండా తాత్కాళిక షెడ్‌ వేయించండి ?

ఈ.వో. ఈ విషయాలపై సంబంధిత అధికారులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటాం.

5. మహేష్‌ – అనకాపల్లి

ప్రశ్న: మా గ్రామంలో ధార్మిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు సహకారం అందించండి ?

ఈ.వో. మీకు ఫోన్‌ చేసి వివరాలు తెలియజేస్తాం.

6. జయ – చెన్నై

ప్రశ్న: ఎస్వీబీసీలో ప్రసారం అవుతున్న నిత్యపూజల్లో ఒకరోజు సాయిబాబా కీర్తనలు ప్రసారం చేయండి?

ఈ.వో. ఎక్కువమంది భక్తుల కోరిక మేరకు నిర్ణయం తీసుకుంటాం.

7. ఏలుమలై – సేలం, నాగేశ్వర్‌ – నాగ్‌పూర్‌, శ్రీనివాస్‌ – తెలంగాణ

ప్రశ్న: దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు త్వరగా దర్శనం చేయించండి?

ఈ.వో. దివ్యదర్శనం టోకెన్ల ద్వారా తక్కువ సమయంలోనే స్వామివారి దర్శనం కల్పిస్తున్నాం. వెండివాకిలి వద్ద క్యూలైన్ల క్రమబద్దీకరణతో భక్తులు తోపులాటల్లేకుండా ప్రశాంతంగా శ్రీవారిని దర్శించుకుంటున్నారు.

8. సుబ్బారావు – ఒంగోలు

ప్రశ్న: తిరుమలలోని పద్మావతి ఏరియాలో గదులు ఇవ్వడం లేదు. గదుల సమాచారం తెలిపే టివీలు పనిచేసేలా చూడండి?

ఈ.వో. పద్మావతి ఏరియాలో అందుబాటులో ఉన్న గదులను భక్తులకు కేటాయించేలా చర్యలు తీసుకుంటాం. టివీలు పనిచేసేలా చూసుకుంటాం.

9. శ్రీనివాసరావు – విశాఖ

ప్రశ్న: బ్రహ్మూెత్సవాల ఏర్పాట్లు బావున్నాయి. గరుడసేవ నాడు గ్యాలరీలలో భక్తులందరికి అన్నప్రసాదాలు, తాగునీరు అందించారు. టిటిడికి ధన్యవాదాలు. గరుడసేవ రోజు భక్తులు గ్యాలరీలలోకి ప్రవేశించే సమయాన్ని ముందుగా తెలియజేయండి. బ్రహ్మూెత్సవాల సమయంలో కొంత శాతమైనా గదులను ఆన్‌లైన్‌లో ఉంచండి ?

ఈ.వో. గరుడసేవ రోజు గ్యాలరీల్లోకి ప్రవేశించే సమయాన్ని ముందుగా భక్తులకు తెలియజేయడం కష్టం. గ్యాలరీలు నిండిన తర్వాత ఆ సమాచారాన్ని భక్తులకు తెలియజేస్తున్నాం. సాధారణ రోజుల్లో రోజుకు 2 వేల గదులను ఆన్‌లైన్‌లో భక్తులకు అందుబాటులో ఉంచుతున్నాం. బ్రహ్మూెత్సవాల సమయంలో రోజుకు వేయి గదులను ఆన్‌లైన్‌లో ఉంచాం.

10. అనిల్‌కుమార్‌ – అనంతపురం

ప్రశ్న: టిటిడి పరిపాలన భవనంలోని పరకామణి విభాగంలో నిల్వ ఉన్న చిల్లర నాణాలను త్వరితగతిన పరకామణి చేయించండి ?

ఈ.వో. చిల్లర నాణాలను క్రమం తప్పకుండా బ్యాంకులకు జమ చేస్తున్నాం.

11. శ్రీనివాసనాయుడు – కర్నూలు

ప్రశ్న: తిరుమల తిరుపతి మధ్య ఆర్టీసి బస్‌ టికెట్‌ ధర ఎక్కువగా ఉంది. తిరుమలలో దుకాణదారుల అధిక ధరలు వసూలు చేస్తున్నారు. ?

ఈ.వో. తిరుమలలో దుకాణదారులు వస్తువులను అధిక ధరలకు విక్రయించకుండా, ఎమ్మార్పీ ధరలకే విక్రయించేలా చర్యలు చేపట్టాం.

12. ఉమాశంకర్‌ – హైదరాబాద్‌

ప్రశ్న: గ్యాలరీలలో భక్తులు వర్షానికి ఇబ్బంది లేకుండా షెడ్లు ఏర్పాటు చేయండి ?

ఈ.వో. భక్తుల ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా నిర్ణయం తీసుకుంటాం.

13. శ్రీనివాసరావు – శ్రీకాకుళం, ప్రభాకర్‌ – నందిగామ

ప్రశ్న: ఆన్‌లైన్‌ డిప్‌లోనూ ఆర్జితసేవలు దొరకడం లేదు ?

ఈ.వో. ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో భక్తులందరూ వారం రోజుల వరకు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. లక్కీడీప్‌ తర్వార మూడు రోజుల పాటు రుసుము చెల్లించేందుకు గడువు ఉంటుంది. అందుబాటులో ఉన్న టికెట్లకు దాదాపు 90 వేలకు పైగా భక్తులు నమోదు చేసుకుంటున్నారు. అందువల్ల పదిశాతం భక్తులు మాత్రమే ఆర్జిత సేవలు పొందే అవకాశం ఉంది.

14. దివాకర్‌్‌ – చెన్నై

ప్రశ్న: ప్రైవేట్‌ బ్యాంక్‌ ఉద్యోగులకు కూడా పరకామణి సేవ అవకాశం కల్పించండి ?

ఈ.వో. దీనిపై త్వరలో తగు నిర్ణయం తీసుకుంటాం.

15. దీపక్‌్‌్‌ – కర్నాటక

ప్రశ్న: తిరుచానూరులో మాంసం విక్రయాలను అరికట్టండి?

ఈ.వో. తిరుచానూరులో అమ్మవారి ఆలయ పరిసరాలలో ఎక్కడా మాంసం విక్రయాల్లేవు. పంచాయతీ పరిధిలో ఉన్న మాంసం దుకాణాలను తొలగించాలని విజ్ఞప్తి చేస్తాం.

16. భాస్కర్‌్‌్‌ – విశాఖ

ప్రశ్న: తిరుమలలో తమిళ సంస్కృతి ఎక్కువగా కనిపిస్తోంది. అర్చకులు, భక్తులు తమిళంలోనే మాట్లాడుతున్నారు. తెలుగుకు ప్రాధాన్యం ఇవ్వండి ? లక్కీడిప్‌లో సేవా టికెట్లు పొందినవారు తిరిగి ఎంతకాలం తర్వాత పొందవచ్చు?

ఈ.వో. తిరుమలలో టిటిడికి సంబంధించిన పేర్లను తెలుగులోనే పెడుతున్నాం. ఇటీవలే టిటిడి వెబ్‌సైట్‌ తెలుగు వర్షన్‌ను ప్రారంభించాం. సరిహద్దు ప్రాంతం కావడంతో తమిళం ఎక్కువగా మాట్లాడుతుంటారు. దేశవ్యాప్తంగా వస్తున్న భక్తుల కోసం తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తున్నాం.

17. జ్ఞానప్రకాశ్‌్‌్‌ – తిరుపతి

ప్రశ్న: నడకదారిలో అనధికార హాకర్లు ఎక్కువగా ఉన్నారు. వారిని నియంత్రించండి?

ఈ.వో. ఈ విషయంపై చర్చిద్దాం.

ఈ కార్యక్రమంలో టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, సివిఎస్‌వో శ్రీ ఎ.రవికృష్ణ, ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీ ఎన్‌. ముక్తేశ్వరరావు, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, విఎస్‌వోలు శ్రీమతి సదాలక్ష్మీ, అన్నప్రసాద విభాగం డిప్యూటీ ఈవో శ్రీ వేణుగోపాల్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.