PLANS TO EXTEND GARUDA VARADHI FLYOVER UP TO ALIPIRI- TTD CHAIRMAN _ గరుడవారధి ఫ్లైఓవర్ ను అలిపిరి వరకు పొడిగించేందుకు ప్రణాళికలు : టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి
Tirumala, 27 May 2021: The plans are afoot to extend the prestigious project of Garuda Varadhi flyover up to Alipiri for facilitating the devotees visiting Tirumala, said TTD chairman Sri YV Subba Reddy on Thursday.
Speaking to media after his inspection of the flyover works underway on war footing near the Tirupati Municipal Park, he said besides avoiding traffic issues in Tirupati town, the four-lane flyover, if extended up to Alipiri toll gate would facilitate smooth passage to both vehicular and walking devotees.
He said the additional cost of extension of the flyover and other related issues will be taken at the next meeting of the TTD board soon.
TTD Chief Engineer Sri M Ramesh Reddy was also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
గరుడవారధి ఫ్లైఓవర్ ను అలిపిరి వరకు పొడిగించేందుకు ప్రణాళికలు : టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి
తిరుమల, 2021 మే 27: తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో నిర్మాణంలో ఉన్న గరుడవారధి ఫ్లైఓవర్ ను అలిపిరి వరకు పొడిగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుపతిలోని మున్సిపల్ పార్క్ సమీపంలో గరుడ వారధి పూర్తయ్యే ప్రాంతంలో జరుగుతున్న పనులను టిటిడి చైర్మన్ గురువారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నాలుగు వరుసల్లో ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్నట్టు తెలిపారు. ఫ్లైఓవర్ ను అలిపిరి వరకు పొడిగించడం వల్ల వాహనాల్లో వెళ్లేవారు నేరుగా టోల్ గేట్ ద్వారా, నడచి వెళ్లేవారు అలిపిరి కాలినడక మార్గం ద్వారా తిరుమలకు వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. ఫ్లైఓవర్ పొడిగించేందుకు అయ్యే వ్యయం తదితర విషయాలను రానున్న బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
టిటిడి చైర్మన్ వెంట చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్ రెడ్డి తదితరులు ఉన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.