PLASTIC BAN IN TIRUMALA IN A PHASED MANNER_ త్వ‌ర‌లో తిరుమలలోని టిటిడి కార్యాల‌యాల‌లో ప్లాస్టిక్ నిషేధం – తిరుమల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి

Tirumala, 13 Aug. 19: While stepping towards a complete plastic ban in Tirumala, the Special Officer Sri AV Dharma Reddy advocated initially the departments in TTD at Tirumala should completely give up plastic bottle usage in their respective offices.

During the weekly review meeting at Annamaiah Bhavan on Tuesday, the SO called upon the officials to work on completely banning the usage of plastic bottles in their offices. He also complimented the Health Department of TTD in Tirumala for observing the total ban on the usage of plastic bottles from the past one week and sought other departments to follow the same.

Later he instructed the SE Electrical Sri Venkateswarulu, TTD PRO Dr T Ravi, SVBC CEO Sri Nagesh Kumar to give wide publicity on complete usage of plastic in Tirumala in a phased manner for the awareness of the pilgrims through Radio and Broadcasting announcements, social media messages and in the form of push notifications respectively. “First let us strictly observe the plastic ban in our departments and later implement the same in big hotels in Tirumala. Give wide publicity that the RO water and Jalaprasadam which is supplied by TTD at Tirumala free of cost is cent per cent pure and safer than the mineral water available in plastic bottles”, he added.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

త్వ‌ర‌లో తిరుమలలోని టిటిడి కార్యాల‌యాల‌లో ప్లాస్టిక్ నిషేధం – తిరుమల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి

తిరుమల, 2019 ఆగ‌స్టు 13: తిరుమ‌ల‌లోని అన్ని టిటిడి కార్యాల‌యాల‌లో ప్లాస్టిక్ క‌వ‌ర్లు, ప్లాస్టిక్ వాట‌ర్ బాటిల్‌ను మ‌రో 10 రోజుల‌లో పూర్తిగా నిషేధించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని టిటిడి తిరుమల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. తిరుమలలోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో మంగళవారం సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్ర‌త్యేకాధికారి మాట్లాడుతూ తిరుమ‌ల పర్యావరణ పరిరక్షణ, ప్ర‌కృతి సౌంద‌ర్యం, శేషాచ‌ల అడ‌వుల‌లోని అరుదైన జీవ జాతుల‌కు ఇబ్బంది లేకుండా ద‌శ‌ల‌వారిగా ప్లాస్టిక్‌ను నిషేధించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఇందులో భాగంగా తిరుమ‌ల‌కు విచ్చేసే భ‌క్తుల‌కు, దుకాణదారుల‌కు, హోటల్ యజమానులకు ప్లాస్టిక్ నిషేధంపై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని అధికారుల‌కు సూచించారు. ఇందుకోసం ఎస్వీబిసీలో స్క్రోలింగ్‌, ల‌ఘుచిత్రాలు ప్ర‌సారం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ కంపార్టుమెంట్ల‌లో వేచి ఉండే భ‌క్తుల‌కు, తిరుమ‌ల‌లో ర‌ద్దీ అధికంగా ఉండే ప్రాంతాల‌లో రేడియో అండ్ బ్రాడ్‌కాస్టింగ్ ద్వారా ప్లాస్టిక్ నిషేధంపై విస్తృతంగా అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సంబంధిత అధికారుల‌కు సూచించారు.

దుకాణదారులు, హోటల్ యజమానులు ప్లాస్టిక్ క‌వ‌ర్లు, ప్లాస్టిక్ వాట‌ర్ బాటిల్‌ల వినియోగాన్ని త‌గ్గించి భ‌క్తుల‌కు ఇబ్బంది లేకుండా ప్ర‌త్యామ్నాయ చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. టిటిడి తిరుమలలోని అన్నిప్రాంతాలలో భక్తులకు జల ప్రసాదం, కొళాయిల ద్వారా సురక్షితమైన తాగునీరు అందిస్తున్నదని తెలిపారు. భక్తులు వీటిని సద్వినియోగం చేసుకుని వాట‌ర్ బాటిల్ వినియోగం తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎఫ్ఎ అండ్ సిఎవో శ్రీ బాలాజి, ఇన్‌చార్జ్ సిఈ శ్రీ రామ‌చంద్రారెడ్డి, అద‌న‌పు సివిఎస్వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటి ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, ఆర్యోగశాఖాధికారి శ్రీ ఆర్.ఆర్.రెడ్డి, విఎస్‌వో శ్రీ మ‌నోహ‌ర్‌, అన్న‌దానం ప్ర‌త్యేకాధికారి శ్రీ వేణుగోపాల్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.