PLAVANAMA UGADI ASTHANAM HELD _ తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా ఉగాది ఆస్థానం
Tirumala, 13 April 2021: The traditional temple court on the occasion of Plavanama Ugadi was held in Tirumala temple on Tuesday.
After the customary rituals, the presiding deity as well processional deities were presented with new silk vastrams.
Earlier, Panchanga Shravanam was rendered by the Vedic Scholar who has delivered fortunes in the year 2021-22 till next Ugadi.
Later Rupaya Harati followed by special Harati were rendered on the occasion.
TTD Chairman Sri YV Subba Reddy, EO Dr KS Jawahar Reddy, members Sri Sekhar Reddy, Sri Prasad, Smt Nischita, Sri Muralikrishna, Additional EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, DyEO Sri Harindranath were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా ఉగాది ఆస్థానం
తిరుమల, 2021 ఏప్రిల్ 13: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం శ్రీ ఫ్లవనామ సంవత్సర ఉగాది ఆస్థానం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతం అనంతరం శుద్థి నిర్వహించారు. ఆ తరువాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేశారు. విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశించారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు మరియు ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేశారు. అనంతరం పంచాంగ శ్రవణం జరిగింది. బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి దంపతులు, అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి దంపతులు, బోర్డు సభ్యులు శ్రీ శేఖర్ రెడ్డి, శ్రీ మురళికృష్ణ, శ్రీ చిప్పగిరి ప్రసాద్, డా.నిశ్చిత, జెఈవో శ్రీమతి సదా భార్గవి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి దంపతులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.