POLICE ARRESTS FOUR ON TTD VIGILANCE COMPLAINT _ టిటిడిలో ఉద్యోగాల పేరిట మోసం చేసిన న‌లుగురి అరెస్టు

Tirupati 04 Nov 2019 ;The Tirupati East Police have arrested four persons who cheated some unemployed in the name of giving jobs in TTD by pocketing huge amounts of money from them.

TTD has been appealing to the people not to fall prey to such misinformation about jobs and recruitment. The process of recruitment in TTD will be by means of notification and it will be advertised in the print media. 

Tirupati based gang comprising one Karthik, Lakshminarayana and Raju advertised in OLX website about jobs in Annaprasadam and Laddu Counters of TTD by making a deal with one Srinivasulu who is working as an Accountant in the Sulabh Organisation. They are all in contact with one Mahesh who is working in Luckmay Agency which is supplying manpower to laddu counters being operated by Indian Bank. 

All these have been collecting Rs.50 thousands per person from unemployed and providing them placements in laddu counters at Tirumala and making huge money through this business.

At this juncture, they have promised one Gopi Singh to give the post of a Supervisor in Annaprasadam in outsourcing. But provided him cleaner post via Sulabh. Singh realized that he was cheated by the gang and contacted TTD Vigilance who in turn complained to Police. 

The East Police have registered a case and caught hold of four while Mahesh is absconding. The police are in search of the fifth man.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI   

టిటిడిలో ఉద్యోగాల పేరిట మోసం చేసిన న‌లుగురి అరెస్టు

విజిలెన్స్ అధికారుల స‌మాచారంతో పోలీసులు కేసు న‌మోదు

మ‌ధ్య‌వ‌ర్తులను న‌మ్మి నిరుద్యోగులు మోస‌పోకండి : టిటిడి

తిరుమ‌ల‌, 2019 న‌వంబ‌రు 04:  టిటిడిలో అన్న‌దానం, ల‌డ్డూ కౌంట‌ర్ల‌లో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల‌ను న‌మ్మించి మోసం చేసిన న‌లుగురు నిందితుల‌ను విజిలెన్స్ అధికారులు గుర్తించి స‌మాచారం ఇవ్వ‌డంతో తిరుప‌తి ఈస్ట్‌ పోలీసులు అరెస్టు చేశారు. ముందుగా నోటిఫికేష‌న్ లేదా ప‌త్రికా ప్ర‌క‌ట‌న ఇచ్చిన త‌రువాత మాత్ర‌మే టిటిడిలో ఉద్యోగాల భ‌ర్తీ జ‌రుగుతుంద‌ని, మ‌ధ్య‌వ‌ర్తులను న‌మ్మి నిరుద్యోగులు మోస‌పోవ‌ద్ద‌ని ఈ సంద‌ర్భంగా టిటిడి తెలియ‌జేస్తోంది.

తిరుప‌తికి చెందిన ల‌క్ష్మీనారాయ‌ణ‌, కార్తీక్‌, రాజు అనే వ్య‌క్తులు అన్న‌దానం, ల‌డ్డూ కౌంట‌ర్ల‌లో ఉద్యోగాలిప్పిస్తామ‌ని ఓఎల్ఎక్స్ అనే ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో ప్ర‌క‌ట‌నలిచ్చారు. వీరు సుల‌భ్ సంస్థలో అకౌంటెంట్‌గా ప‌నిచేస్తున్న శ్రీ‌నివాసులుతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అదేవిధంగా, ల‌క్మే అనే మ్యాన్‌ప‌వ‌ర్ ఏజెన్సీ ద్వారా ఇండియ‌న్ బ్యాంకు నిర్వ‌హిస్తున్న ల‌డ్డూ కౌంట‌ర్ల‌కు సిబ్బందిని స‌ర‌ఫ‌రా చేస్తున్న మ‌హేష్ అనే వ్య‌క్తితోనూ మాట్లాడుకున్నారు. ల‌క్ష్మీనారాయ‌ణ‌, కార్తీక్‌, రాజు బృందంగా ఏర్ప‌డి శ్రీ‌నివాసులు, మ‌హేష్ సాయంతో అన్న‌దానం, ల‌డ్డూ కౌంట‌ర్ల‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు. నిరుద్యోగుల వ‌ద్ద రూ.50 వేలు చొప్పున వ‌సూలు చేసి అంద‌రూ పంచుకుంటారు.

ఈ క్ర‌మంలో గోపి సింగ్ అనే నిరుద్యోగికి అన్న‌దాన విభాగంలో ఔట్‌సోర్సింగ్‌లో సూప‌ర్‌వైజ‌ర్ పోస్టు ఇప్పిస్తామ‌ని ఈ బృందం న‌మ్మించింది. ఆ త‌రువాత సుల‌భ్ సంస్థ ద్వారా క్లీన‌ర్ పోస్టు ఇప్పించారు. మోస‌పోయాన‌ని తెలుసుకున్న గోపి సింగ్ టిటిడి విజిలెన్స్ అధికారుల‌ను ఆశ్ర‌యించాడు. విజిలెన్స్ అధికారులు విచార‌ణ జ‌రిపి తిరుప‌తి ఈస్ట్‌ పోలీసుల ద్వారా ల‌క్ష్మీనారాయ‌ణ‌, కార్తీక్‌, రాజు, శ్రీ‌నివాసులపై కేసు న‌మోదు చేయించారు. ప‌రారీలో ఉన్న మ‌హేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.