WALL POSTERS RELEASED _ తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్ధేశ్వరస్వామివారి పవిత్రోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ

Tirupati, 17 Aug. 19: The wall posters related to annual pavitrotsavams of Sri Chennakesava Swamy temple and Sri Siddheswara Swamy temple at YSR Kadapa district were released on Saturday by Sri P Basant Kumar, TTD JEO.

When the annual fete in Sri Siddheswara Swamy temple will be observed from August 21-23 while those of Sri Chennakesava Swamy from September 3-5 with Ankurarpanam on September 2.

DyEO Sri Govindarajulu, SE 1 Sri Ramesh Reddy were also present in this event.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్ధేశ్వరస్వామివారి పవిత్రోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ

తిరుపతి, 2019 ఆగస్టు 17: టిటిడికి అనుబంధంగా ఉన్న కడప జిల్లా తాళ్లపాకలో గల శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్ధేశ్వరస్వామి వారి వార్షిక పవిత్రోత్సవాల గోడపత్రికలను టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌ కుమార్‌ శనివారం ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల జెఈవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.

శ్రీ సిద్ధేశ్వరస్వామివారి ఆలయంలో….

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ తాళ్లపాకలోని శ్రీ సిద్ధేశ్వరస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు ఆగస్టు 21 నుంచి 23వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఇందులో భాగంగా పవిత్రోత్సవాల్లో భాగంగా ఆగస్టు 21వ తేదీ సాయంత్రం 5.00 గంటలకు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, మ త్సంగ్రహణం, వాస్తు హోమము, అంకురార్పణం, నిర్వహిస్తారన్నారు. ఆగస్టు 22న యాగశాలలో వైదిక కార్యక్రమాలు, గ్రంధి పవిత్ర పూజ, ఆగస్టు 23న నిత్యపూజ, నిత్య హోమం, పవిత్ర సమర్పణ, పూర్ణాహుతి, పవిత్రవితరణ, సాయంత్రం 5.00 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల ఊరేగింపు, గ్రామోత్సవము నిర్వహించనున్నట్లు తెలియజేశారు.

శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయంలో …..

అదేవిధంగా తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు సెప్టెంబరు 3 నుంచి 5వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబరు 2వ తేదీ సాయంత్రం విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, రుత్విక్‌ వరణం, రక్షాబంధనం, మ త్సంగ్రహణం, అంకురార్పణంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు.

ఇందులో భాగంగా సెప్టెంబరు 3వ తేదీ ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు చతుష్టార్చన, బింభ, మండల, కుంభ, కుండల ఆరాధనలు, పవిత్రప్రతిష్ఠ, సాయంత్రం 6.00 నుండి 9.00 గంటల వరకు యాగశాలపూజ, పవిత్రహక్షమము నిర్వహిస్తారన్నారు. సెప్టెంబరు 4వ తేదీ ఉదయం 9.00 నుండి మధ్యహ్నం 1.00 గంట వరకు పవిత్ర సమర్పణ, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబరు 5న ఉదయం 6.00 నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, పవిత్ర వితరణ కార్యక్రమాలు జరుగనున్నాయి. సాయంత్రం 6.00 గంటల నుండి స్వామి, అమ్మవార్లవీధి ఉత్సవం నిర్వహించనున్నట్లు వివరించారు.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో హరికథలు, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజులు, ఎస్‌ఇ-1 శ్రీ రమేష్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ,

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.