POSTERS OF VISESHA PUJA HOMA MAHOTSAVAMS AT SRI KAPILESWARA SWAMY TEMPLE RELEASED_ కార్తీకమాస విశేష పూజ హోమ మహోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ
Tirupati, 13 October 2017: The posters of Viseshapuja Homa Mahotsavams at Sri Kapileswara temple were released by Tirupati JEO Sri P Bhaskar in his chambers in TTD administrative building in Tirupati on Friday.
Speaking on this occasion, the JEO said, the holy event commences with Ankurarpanam on October 20th, TTD is organizing Sri Ganapathi Homam from Oct.21-23, Sri Subramanya Homam from Oct.-24-25, Kalyanotsavam on Oct.20 and Sri Dakshinamurti Homam on Oct 28 at the temple.
Similarly Sri Navagraha Homam on Oct.27th, Sri Kamakshi Homam (Chandi Homam) from Oct.28-Nov 5, Sri Kapileswara Homam (Rudra Homam) from Nov.6-16 Sri Kalabhairava Homam on Nov.17, Sri Chandikeswara Homam, Trishula snanam, Tiruveedhi utsavam of Panchamurthis will be organised by the TTD on November 18.
Temple DyEO Sri Subramanyam was also present.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI
కార్తీకమాస విశేష పూజ హోమ మహోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ
తిరుపతి, 2017 అక్టోబరు 13: పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 20 నుంచి నవంబరు 18వ తేదీ వరకు నెల రోజుల పాటు నిర్వహించనున్న విశేషపూజ హోమ మహోత్సవాల గోడపత్రికలు, కరపత్రాలను టిటిడి తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పోల భాస్కర్ ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల జెఈవో కార్యాలయంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం సామూహికంగా ఈ హోమ మహోత్సవాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. టిటిడి అన్ని విభాగాలు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు హోమాల్లో పాల్గొనాలని ఆయన కోరారు.
అక్టోబరు 20 తేదీన హోమ మహోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నట్లు తెలిపారు. అక్టోబరు 21 నుంచి 23వ తేదీ వరకు మొదటగా శ్రీగణపతిస్వామివారి హోమం, అక్టోబరు 24, 25వతేదీల్లో శ్రీసుబ్రమణ్యస్వామివారి హోమం, అక్టోబరు 26న శ్రీదక్షిణామూర్తిస్వామివారి హోమం అక్టోబరు 28న శ్రీ నవగ్రహ హోమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా అక్టోబరు 28 నుంచి నవంబరు 5వ తేదీ వరకు శ్రీ కామాక్షి అమ్మవారిహోమం(చండీహోమం), నవంబరు 6 నుంచి 16 వరకు శ్రీకపిలేశ్వర స్వామివారి హోమం(రుద్రయాగం), నవంబరు 17న శ్రీకాలభైరవ స్వామివారి హోమం, నవంబరు 18న శ్రీచండికేశ్వరస్వామివారి హోమం, త్రిశూలస్నానం, పంచమూర్తుల తిరువీధి ఉత్సవం నిర్వహించనున్నట్లు వివరించారు.
గృహస్తులు (ఇద్దరు) రూ.500/- చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారని తెలిపారు. ఈ హోమాల్లో పాల్గొనే గృహస్తులు కచ్చితంగా సంప్రదాయ వస్త్రధారణలో రావాలన్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, ఏఈవో శ్రీ శంకర్‌రాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.