POTTI SRIRAMULU JAYANTI TO BE OBSERVED ON MARCH 16 _ మార్చి 16న శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి

TIRUPATI, 14 MARCH 2024: The state function of Amarajeevi Sri Potti SriramuluJayanti will be observed by TTD at Annamacharya Kalamandiram in Tirupati on March 16.

Potti Sreeramulu was an Indian freedom fighter from the state of Andhra Pradesh and was revered as Amarajeevi (immortal being) for his self-sacrifice for the formation of a separate state for Andhra Pradesh. He became famous for undertaking a hunger strike for 56 days in support of having a separate state for Andhra Pradesh; he died in the process. The Jayanti fete will commence at 11 am on March 16. 

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

మార్చి 16న శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి

తిరుప‌తి, 2024, మార్చి 14: ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన మేర‌కు రాష్ట్ర పండుగ అయిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతిని మార్చి 16న శ‌నివారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో టీటీడీ నిర్వ‌హించ‌నుంది. ఉద‌యం 11 గంట‌ల‌కు ఈ కార్య‌క్ర‌మం ప్రారంభ‌మ‌వుతుంది.

పొట్టి శ్రీరాములు రాష్ట్రానికి చెందిన భారత స్వాతంత్య్ర‌ సమరయోధుడు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఆయ‌న 56 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. ఈ ప్ర‌క్రియ‌లో ఆత్మ త్యాగం చేసి అమరజీవిగా కీర్తించ‌బ‌డ్డారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.