POURNAMI GARUDA SEVA AT TIRUMALA ONE SEPTEMBER 2 _  సెప్టెంబ‌రు 2న తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో పౌర్ణమి గరుడసేవ

Tirumala, 31 Aug. 20: The monthly Pournami Garuda Seva will be observed at Tirumala temple on September 2.

In view of COVID 19 restrictions, the event takes place inside the temple premises.

The processional deity of Lord Sri Malayappa Swamy is seated on Garuda Vahana at Ranganayakula Mandapam between 5pm and 6pm as a part of the event.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సెప్టెంబ‌రు 2న తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో పౌర్ణమి గరుడసేవ

తిరుమల, 2020 ఆగ‌స్టు 31: తిరుమలలో శ్రీ‌వారి ఆల‌యంలో సెప్టెంబ‌రు 2వ తేదీన పౌర్ణమి గరుడసేవ జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 

ఇందులో భాగంగా  సాయంత్రం 5.00 నుండి 6.00 గంట‌ల వ‌ర‌కు తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయ‌క మండ‌పంలో సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు త‌న‌కు ఎంతో ప్రీతిపాత్ర‌మైన గరుడ వాహ‌నాన్ని అధిరోహించ‌నున్నారు.   

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల‌లో భాగంగా గ‌రుడ వాహ‌న సేవ‌ను ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్నారు.    

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.