POURNAMI GARUDA SEVA HELD _ వైభవంగా పౌర్ణమి గరుడ సేవ
TIRUMALA, 20 SEPTEMBER 2021: The monthly Pournami Garuda Seva held with religious fervour in Tirumala on Monday evening.
Sri Malayappa Swamy took a celestial ride along four Mada streets to bless His devotees from 7pm onwards.
Devotees gathered in galleries to witness the mighty Garuda Vahana Seva.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
వైభవంగా పౌర్ణమి గరుడ సేవ
సెప్టెంబరు 20, తిరుమల 2021: తిరుమలలో సోమవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టిటిడి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే.ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.
గరుడ వాహనం – సర్వపాప ప్రాయశ్చిత్తం
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ, శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. వేదాలు, ఆచార్యులు గరుడుడిని వేదస్వరూపుడిగా పేర్కొన్నారు. గరుత్మంతుని రెక్కలు వేదం నిత్యత్వానికి, అపౌరుషేయత్వానికి ప్రతీకలని స్తుతించారు. గరుడుని సేవాదృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. ఇందుకే గరుడసేవకు ఎనలేని ప్రచారం, ప్రభావం, విశిష్టత ఏర్పడ్డాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.